Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? బీజేపీ మాత్రం తన దూకుడు ప్రదర్శిస్తోంది. ఎక్కడ ఏం జరిగినా బీజేపీ నేతలు ప్రత్యక్షమై ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం నిశ్శబ్దంగా మారింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందా? లేదా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చెబుతూ అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అన్ని చోట్ల ప్రభుత్వ విధానాలను ఎండగడుతోంది. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బాలికపై జరిగిన అత్యాారంపై బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడింది వరంగల్ జిల్లాలో రైతులపై జరిపిన దాడిని కూడా తీవ్రంగా ఖండించింది.

ఇన్ని జరుగుతున్నా కాంగ్రెస్ మాత్రం నోరు మెదపడం లేదు. ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. దీంతో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకం కానుందా అనే కామెంట్లు వస్తున్నాయి. అయినా కనీసం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడటం లేదు. ప్రభుత్వ తీరును ఖండించడం లేదు. సరికదా చోద్యం చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇన్ని దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ప్రజల కోసమే పని చేస్తున్నామని చెబుతున్నా ఎక్కడ కూడా ఆ చాయలు కనిపించడం లేదు.
Also Read: Punishment For Rape: మైనర్లపై అత్యాచారాలు.. దేశంలో ఎలాంటి శిక్ష పడుతుందంటే?
మరోవైపు రాష్ర్టంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీఆర్ఎస్ పై విమర్శలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల దాకా అందరిపై ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎందరు పీకేలు వచ్చినా టీఆర్ఎస్ అపజయం ఖాయమనే వాదనలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ మాత్రం తన ఉనికి కోల్పోతోంది. బీజేపీ మాత్రం బలోపేతం కావాలని బావిస్తోంది. ఇందుకోసం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.

రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా మూడోసారి అవకాశం ఇచ్చిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్ కు రెండు సార్లు చంద్రబాబుకు రెండుసార్లు వైఎస్ఆర్ కు రెండు సార్లు అదే విధంగా కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈ మారు మార్పు కోరుతున్నారు. అదే అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ చూస్తోంది. రాష్ట్రంలో పాగా వేయాలని పావులు కదుపుతోంది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఆరాట పడుతోంది. దాని కోసమే ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా ప్రత్యక్షమై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం తన పరిధి దాటడం లేదు. ఇలాగైతే కష్టమే. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సైతం చేదు అనుభవమే ఎదురు కానుందని విశ్లేషకుల అంచనా.
Also Read:Singer KK: సింగర్ కాకముందు కేకే ఎలాంటి పనులు చేసేవాడో తెలుసా?
Recommended Videos