Prabhas Sister: వెండితెర రెబల్ స్టార్ ప్రభాస్. ఆయనకో చెల్లి ప్రసీద. ఆమె కూడా నిర్మాతగా మారారు. రాధేశ్యాం సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రభాస్ కు ఓ సోదరుడు ప్రబోధ్ కూడా ఉన్నారు. ఈశ్వర్ తో అరంగేట్రం చేసిన ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు, తల్లి శివకుమారి. ప్రభాస్ తన సినిమాలతో స్టార్ డమ్ గా ఎదిగారు. వరుస హిట్లతో ఇండస్ట్రీనే ఫట్ ఫట్ లాడించారు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపుతూ కొ్త్తదనంగా పాత్రలు ఉండేలా చూసుకున్నారు. దీంతో అందరి గుండెల్లో డార్లింగ్ గా నిలిచిపోయారు. ప్రభాస్ ది పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. అది చిరంజీవి ఊరు కూడా అదే కావడం గమనార్హం.

ఇక ప్రభాస్ చెల్లెలు ప్రసీద ఇటీవల ఓ ఫుడ్ సంస్థపై కామెంట్లు చేసింది. స్విగ్లీ అనే సంస్థ అందించే ఫుడ్ బాగా లేదని, వారు సమయానికి అందించరని కామెంట్లు పెట్టింది. దీంతో వారి సేవలు సరిగా లేనందున తాము వేరే యాప్ చూసుకుంటామని కూడా పేర్కొంది. స్విగ్లీ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని విమర్శలు చేసింది. దీనిపై స్విగ్లీ వారు స్పందించారు. మీ ఐడీ నెంబర్ పంపాలని సూచించారు. మీరే కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం అని పోస్టు పెట్టారు. దీంతో ఆమె ఇదో చెత్త అనుభవం అని కామెంట్లు పెట్టింది.
Also Read: Tarakaratna NTR: జూ.ఎన్టీఆర్ కు పోటీగానే తారకరత్న సినిమాల్లోకి వచ్చాడా? సంచలన విషయం చెప్పిన హీరో
దీంతో ప్రసీదకు చేదు అనుభవం ఎదురైనట్లు అయింది. అదో చెత్త పోస్టింగ్ గా అభివర్ణించారు. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజుకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండేది. రెబల్ స్టార్ బిరుదు ఆయనదే. తరువాత కాలంలో ప్రభాస్ కు పెడుతున్నారు. చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. ఆయన నటించిన బాహుబలి చరిత్రను తిరగరాసింది. ఎన్నో మైలురాళ్లు దాటుకుని తన ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా వెనుదిరగక ముందుకే నడుస్తున్న నటుడు ప్రభాస్.

ప్రభాస్ ప్రస్తుతం సలార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది కేజీఎఫ్ -2 కు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తోంది. దీంతో అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఇవాళ ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు కావడంతో ప్రభాస్, కేజీఎప్ -2 హీరో యశ్ ఇద్దరు బెంగుళూరు వెళ్లి అక్కడ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో దానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. అభిమానులకు కనువిందు అవుతోంది. తమ అభిమాన హీరో కోసం వారు దేనికైనా రెడీ అనే విధంగా పోస్టులు పెడుతున్నారు.
Also Read:Mahesh Babu- Allu Arjun: మహేష్ కి అల్లు అర్జున్ స్పెషల్ రెస్పెక్ట్… విబేధాలు తొలగినట్లేనా?
Recommended Videos:
[…] Also Read: Prabhas Sister: ప్రభాస్ చెల్లికి చేదు అనుభవం.. స… […]