Telangana Elections 2023: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆపరేషన్ కాంగ్రెస్ ప్రారంభించారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు టచ్ లోకి వెళ్ళారా? వారిని తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఆ ప్రయత్నం చేశారని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించడం సంచలనం రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో ఇదో హాట్ టాపిక్ గా మారింది.అందులో నిజం ఉందా? లేదా? అన్న బలమైన చర్చ నడుస్తోంది.
తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడతామని కేసీఆర్ భావిస్తున్నారు. ధీమా వ్యక్తం చేస్తున్నారు. బోటాబోటి మెజారిటీ వచ్చినా.. 50 స్థానాల వరకు చేజిక్కించుకున్నా.. కెసిఆర్ మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించి అధికారాన్ని హస్త గతం చేసుకుంటారని అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం 70 మంది ఎమ్మెల్యే మద్దతు ఉంటేనే.. ఎలాంటి భయం లేకుండా ఆ పార్టీ అధికారంలో కొనసాగుతుందని చర్చ బలంగా నడుస్తోంది. అంతకంటే తక్కువ సీట్లు వస్తే మాత్రం ప్రలోభాల ఎర తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో బహు నాయకత్వం. ఇప్పటికే నాయకులు మధ్య విభేదాలు ఉన్నాయి. వాటన్నింటినీ పక్కనపెట్టి తెలంగాణ ఎన్నికల్లో గట్టిగానే పోరాడారు. విజయం ముంగిట నిలబడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో పదవుల పంపకాల్లో చాలా రకాల ఇబ్బందులు వస్తాయని తెలుసు. వాటన్నింటి గురించి కెసిఆర్ కు తెలిసినంతగా మరొకరికి తెలియదు. అసలే కాంగ్రెస్ లో ఒక్కొక్కరిది ఒక్కో వర్గం. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పొసగని కాంగ్రెస్ నాయకులు ఎక్కువ. రేవంత్ ను సీఎంగా ప్రకటిస్తే మాత్రం అభ్యంతరాలు కూడా ఆ స్థాయిలో ఉంటాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం వివాదం తలెత్తితే.. దానిని క్యాస్ట్ చేసుకునేందుకు కేసిఆర్ సిద్ధంగా ఉంటారు. టిఆర్ఎస్కు బిజెపితో పాటు మజ్లిస్ మద్దతు ఎలానూ ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు దాటినా.. కొద్దిపాటి దూరంలో నిలిచిపోయినా.. అటు తరువాత పెద్ద పార్టీగా నిలిచే బిఆర్ఎస్ కే అధికారం చేపట్టబోయే అరుదైన అవకాశం రానుంది. అందుకే కేసిఆర్ కు ఆ ఛాన్స్ ఇవ్వకుండా.. కాంగ్రెస్ పార్టీ కట్టుదిట్టమైన ఏర్పాట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. రేపటి ఫలితాలతో ఫుల్ క్లారిటీ రానుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.