Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమవుతోంది. మరి కొన్ని గంటల్లో రిజల్ట్ విడుదల కానున్నాయి. అయితే గురువారం సాయంత్రం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా అధికార బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక శుక్రవారం వచ్చిన ఇండియా టుడే, ఆజ్‌తక్ ఎగ్జిట్ పోల్స్ కూడా గులాబీ పార్టీకి వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో ఇప్పుడు రాజకీయ సమీకరణు ఎలా మారతాయన్న చర్చ జరుగుతోంది. కొన్ని సర్వేలు హంగ్‌కు అవకాశం ఉందని తేల్చాయి.
హంగ్ వస్తే..
తెలంగాణలో తొలిసారిగా హంగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే.. ఎవరరెవరు కలుస్తారన్న చర్చ ఇప్పటికే జరుగుతోంది. బీఆర్‌ఎస్ మిత్రపక్షం, కేసీఆర్ తన దోస్తుగా చెప్పుకునే అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం మద్దతు ఇవ్వడం ఖాయం. అయితే బీఆర్‌ఎస్‌కు 55 సీట్లు వస్తేనే ఎంఐఎం మద్దతు ఇచ్చినా ప్రయోజనం ఉంటుంది. బీఆర్‌ఎస్ 55, ఎంఐఎం ఏడు సీట్లు కలిస్తే మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోవడం ఈజీ. కానీ అలా కాని పక్షంలో ఏం జరుగుతుందనేది అంతు చిక్కడం లేదు.
కాంగ్రెస్‌కు ఛాన్స్..
బీఆర్‌ఎస్‌కు కాకుండా, కాంగ్రెస్‌కు మ్యాజిక్ ఫిగర్‌కు సరిపడా సీట్లు వస్తే… ఆ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. తర్వాత ఎంఐఎం ఎవరితో ఉంటుంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడూ అధికార పక్షం తరఫున ఉండే ఎంఐంఎ కేసీఆర్‌తో ఉన్న పదేళ్ల దోస్తానాకు కటీఫ్ చెప్పడం ఖాయమంటున్నారు. అధికార కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
ఎవరికీ మెజారిటీ రాకుంటే..
ఇక కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో ఎవరికీ మెజారిటీ రాకుంటే బీజేపీ, ఎంఐఎం కీలకం అవుతాయి. ప్రస్తుతం బీఆర్‌స్, కాంగ్రెస్ నేతలంతా.. తమకు ఎన్ని సీట్లు వస్తాయో తెలుసుకోవడంతోపాటు బీజేపీ ఎన్ని గెలుస్తుంది. ఎంఐఎంకు సీట్లు తగ్గుతాయా అన్న అంశంపై ఆరా తీస్తున్నాయి. బీజేపీకి 10 కన్నా ఎక్కువ సీట్లు వస్తే కింగ్ మేకర్ కావడం ఖాయం అంటున్నారు. బీఆర్‌ఎస్‌కు 55 వచ్చినా.. ఎంఐఎం సీట్లు ఐదుకే పరిమితమైనా ప్రభుత్వం ఏర్పాటు చేయడం క్లిష్టంగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బీజేపీ–బీఆర్‌ఎస్ ప్రభుత్వం..
ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాలు గెలిస్తే.. బీఆర్‌ఎస్–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకోదు. కాబట్టి బీఆర్‌ఎస్‌కు బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే మెజారిటీకి దగ్గరా వచ్చి ఆగిపోయిన కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదు. అప్పుడు ఎంఐఎం కూడా బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరో 24 గంటలు ఆగాల్సిందే.