https://oktelugu.com/

Bank Account: మీకు తెలియకుండా మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయా.. ఇదే కారణం.. వెంటనే ఇలా చేయండి !

Bank Account: ఎలాంటి మెసేజ్ లేదు.. ఎవరికీ డబ్బులు పంపించిన గుర్తు లేదు.. కానీ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయ్యాయి.. అకౌంట్ చెక్ చేస్తే రూ.236కట్ అయినట్లు ఉంది.

Written By: , Updated On : February 24, 2025 / 11:42 AM IST
Bank Account

Bank Account

Follow us on

Bank Account: ఎలాంటి మెసేజ్ లేదు.. ఎవరికీ డబ్బులు పంపించిన గుర్తు లేదు.. కానీ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయ్యాయి.. అకౌంట్ చెక్ చేస్తే రూ.236కట్ అయినట్లు ఉంది. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాలు ఉన్న చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇదే. నేడే కాదు గత కొద్ది రోజులుగా ఎస్ బీఊ ఖాతాదారులు గమనిస్తున్న విషయం. అయితే ఎస్‌బీఐ ఖాతా నుంచి డబ్బులు ఎందుకు కట్‌ అయ్యాయో అర్థం కాక బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు కొందరు. వాస్తవానికి మార్చి నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఏటీఎం కార్డులకు రుసం వసూలు చేస్తోంది. ఎస్‌బీఐ క్లాసిక్‌, సిల్వర్‌, గ్లోబల్‌ వంటి కార్డులకు సంబంధించి వార్షిక రుసుం రూ.200గా ఉంది.

ఈ మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వసూలు చేస్తుందన్న మాట. అయితే కార్డు ఫీజు రూ.200కదా మరి రూ. 236 ఎందుకు కట్‌ చేశారన్న సందేహం వస్తుంది కదా చాలా మందిలో.. మరి జీఎస్టీ వద్దా. ఈ ట్రాన్సాక్షన్‌పై 18 పర్సంటేజ్ జీఎస్టీ కూడా కట్టాలి కదా. దీని ప్రకారం 18 శాతం అంటే రూ. 36 ట్యాక్స్‌ ఉంటుందన్న మాట. ఇలా మొత్తం ఖాతాదారుల అకౌంట్ల నుంచి రూ. 236 కట్‌ అవుతున్నాయన్నమాట. అయితే ఈ మెయింటెనెన్స్‌ ఛార్జీలు అనేవి మాత్రం మనం ఉపయోగించే కార్డు టైప్ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ ఖాతాలో సరిపడా అమౌంట్ లేకపోతే బ్యాలెన్స్ మైనస్ లోకి వెళుతుంది.

క్లాసిక్, సిల్వర్‌ గ్లోబల్‌ కార్డులకు రూ. 236.. యువ, గోల్డ్, కాంబో, మై కార్డ్ లకు రూ.250లతో పాటు అదనంగా జీఎస్టీ ఉంటుంది. ఇక, ప్లాటినం కార్డులకు ఇంత కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ కార్డులపై రూ. 350తో పాటు జీఎస్టీ ఉంటుంది. ఇక గరిష్టంగా ప్రైడ్‌, ప్రీమియం కార్డులపై ఏకంగా రూ. 425తో పాటు జీఎస్టీ ఎక్స్ ట్రా వసూలు చేస్తారు. అయితే కొందరికి ఈ డబ్బు డెబిట్‌కు సంబంధించి ఫోన్లకు మెసేజ్ లు వస్తుంటాయి.

అలాగే ఎస్ బీఐ యూపీఐ పేమెంట్స్ విషయంలో కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది. రోజువారీ యూపీఐ లావాదేవీ పరిమితిని కూడా అమలు చేసింది. దీని ప్రకారం యూజర్లు రోజుకు గరిష్టంగా 10 లావాదేవీలు మాత్రమే చేసుకోవచ్చు. గరిష్టంగా రూ. లక్ష వరకు ట్రాన్సాక్షన్లను చేసుకోవచ్చు. అయితే ఈ మొత్తాన్ని పెంచుకోవాలంటే ఎస్‌బీఐకి చెందిన యోనో యాప్‌ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు.