PM Kisan
PM Kisan 19th Installment: దేశంలోని చిన్న రైతులు(5 ఎకరాలు) ఉన్న రైతులకు కేంద్రం ఏటా పీఎం కిసాన్ పేరుతో పెట్టుబడి సాయం అందిస్తోంది మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటి వరకు 18 విడతలుగా సాయం అందించిన కేంద్రం తాజాగా 19వ విడత సాయం కోసం రూ.22 వేల కోట్లు కేటాయించింది. ఈ నిధులు రైతుల ఖతాల్లో సోమవారం(ఫిబ్రవరి 24) జమ కానున్నాయి. బిహార్‌లోని బగల్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ 19వ విడత పెట్బుడిని ప్రారంభించనున్నారు. 2019 ఫిబ్రవరి 24న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభించారు. ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు రూ.3.46 లక్షల కోట్లు చెల్లించింది. తాజాగా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లు జమ చేయనుంది.
ఎన్నికల నేపథ్యంలో..
బిహార్‌లో పీఎం కిసాన్ 19వ విడత నిధులు విడుదల చేయడానికి కారణం.. ఈ ఏడాది చివరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీ బగల్‌పూర్‌ను ఎంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. బిహార్‌లో రైతులు ఎక్కువ. కొన్నేళ్లుగా వారు రకరకాల పంటలు పండిస్తూ, ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. ఇటీవల కేంద్రం బడ్జెట్‌లో ప్రభుత్వం పూల్ మఖానా బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే బిహార్‌పై కేంద్రం దృష్టి పెట్టింది.
కేవైసీ తప్పనిసరి..
ఇదిలా ఉంటే పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే రైతుల తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలో ఈ కేవైసీ పూర్తి చేయాలి. దీనినే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అంటారు. అకౌంట్ ఓపెన్ చేశాక బ్యాంకు వారు అడిగే వివరాలు ఇవ్వాలి. ఖాతాకు ఫోన్ నంబర్, ఆధార్ లింక్ చేసి ఉంఆడలి. అడ్రస్, గుర్తింపు కార్డుల వెరిఫికేషన్ పూర్తిచేసి ఉండాలి. ఈకేవైసీ సంపూర్ణంగా చేసినవారికే పీఎం కిసాన్ డబ్బుల సమ అవుతాయి. ఈ కేవైసీని బ్యాంకుకు వెళ్లి చేయించుకోవాలి. లేదా https://pmkisan.gov.in సైట్‌లో కూడా ఈ–కేవైసీ పూర్తి చేసి ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. మీసేవ కేంద్రాల్లో కూడా ఈ కేవైసీ చేసుకోవచ్చు. PM&KISAN మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్ ఉంటుంది. అది రైతు ముఖాన్ని గుర్తుపడుతుంది. తద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
ఇలా చెక్ చేసుకోవాలి..
ప్రధాని మోదీ ప్రారంభించాక రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఎవరికైనా జమ కాని పక్షంలో బ్యాంకులో సంప్రదించాలి. అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in) లోకి వెళ్లి Beneficiary Status లోకి వెళ్లాలి. అక్కడ Farmers Corner సెక్షన్‌లోకి వెళ్లి ఆధార్ నంబర్, బ్యాంకు అకౌంట్‌ంబర్, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి. తర్వాత Get Data పై క్లిక్ చేస్తే, మీ స్టేటస్ తెలుస్తుంది. డబ్బులు జమ అయింది లేనిది తెలుసుకోవచ్చు. ఇంకా ఏదైనా అనుమానం ఉంటే..PM&KISAN హెల్ప్ లైన్ నంబర్ 155261 లేదా 011–24300606కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.