https://oktelugu.com/

వీడియో: భూమికి 410కి.మీల ఎత్తులో నాసా అద్భుతం

ఒకటి కాదు.. రెండు కాదు.. భూమికి 410 కి.మీల ఎత్తులో.. అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో.. ఆక్సిజన్ సరఫరా అస్సలే లేని చోట.. భూమి చుట్టూ తిరుగుతున్న ఈ అంతర్జాతీయ కేంద్రంలో వ్యోమగాములు మరోసారి అద్భుతమే చేశారు. అయితే ఈసారి వీడియో తీశారు. భూమి అంత ఆకాశం నుంచి నీలిసంద్రంలా కనిపిస్తున్న తీరు కట్టిపడేస్తోంది. వ్యోమగాములు అంత ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మరమ్మతులు చేస్తున్న వీడియోను తాజాగా నాసా షేర్ చేసింది. అది వైరల్ గా […]

Written By:
  • NARESH
  • , Updated On : June 26, 2021 1:53 pm
    Follow us on

    ఒకటి కాదు.. రెండు కాదు.. భూమికి 410 కి.మీల ఎత్తులో.. అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో.. ఆక్సిజన్ సరఫరా అస్సలే లేని చోట.. భూమి చుట్టూ తిరుగుతున్న ఈ అంతర్జాతీయ కేంద్రంలో వ్యోమగాములు మరోసారి అద్భుతమే చేశారు. అయితే ఈసారి వీడియో తీశారు. భూమి అంత ఆకాశం నుంచి నీలిసంద్రంలా కనిపిస్తున్న తీరు కట్టిపడేస్తోంది. వ్యోమగాములు అంత ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మరమ్మతులు చేస్తున్న వీడియోను తాజాగా నాసా షేర్ చేసింది. అది వైరల్ గా మారింది.

    అంతరిక్షంలో మనిషి నడక ఒక అద్భుతం. గాలి, కింద నేల లేని చోట అలా తేలియాడడం అదొక వింతైన అనుభవం అని చెప్పాలి. అంతరిక్ష యాత్రలో స్పేస్ వాక్ చాలా క్లిష్టం. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) అదే చేసింది.

    భూమికి 410 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టు తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మరమ్మతులు చేస్తున్న వ్యోమగాముల వీడియోను నాసా తీసింది. ఆ అద్భుత దృశ్యాన్ని నాసా నెటిజన్లతో పంచుకుంది.

    ఇద్దరు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విద్యుత్ సరఫరాను మెరుగుపర్చే సమయంలో తీసిన వీడియో ట్విట్టర్ లో నాసా షేర్ చేయగా వైరల్ గా మారింది. అంత ఎత్తులో భూమి నీలి రంగులో కనువిందు చేసేలా ఉంది.

    ఆ అద్భుతమైన వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి..

    https://twitter.com/NASA/status/1408413762512642051?s=20