Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును భయం వెంటాడుతోంది. ప్రతిసారి ఎన్నికల్లో ఆయనకు భయం మామూలైపోతోంది. దీంతో ఎన్నికలు ఓ సవాలుగా మారుతున్నాయి. అధికారం కూడా దోబూచులాడుతోంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారి కాకుండా ఆయనకు అధికారం ఒకసారి తప్పించి మరోసారి చేతికి చిక్కుతోంది. ఈ లెక్కన ఈసారి తనదే అధికారమనే ఆశలో ఉన్నారు. ఎలాగైనా వైసీపీని అధికారానికి దూరం చేసి మరోసారి కుర్చీ ఎక్కాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు.
గతంతో పోల్చితే టీడీపీలో మార్పు కనిపిస్తోంది. ఇంతకుముందు కార్యకర్తలను పట్టించుకోని బాబు ఈ సారి వారికి అగ్రతాంబూలం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. వైసీపీని ఎదుర్కొనే క్రమంలో అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నారు. గత ఎన్నికల అనుభవాలను వడపోస్తూ చేసిన తప్పులను చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read: Chandrababu: చంద్రబాబు చాణక్యం.. టీడీపీ చేతిలోకి మరో అస్త్రం.. ఈ సారి విక్టరీ గ్యారెంటీ..!
చంద్రబాబు ఈ సారి ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోనే అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని పార్టీని విజయతీరాలకు చేర్చాలని చూస్తున్నారు. కార్యకర్తలకు బలం చేకూర్చి వారిలో మానసిక స్థైర్యం నింపాలని చూస్తున్నారు. పార్టీ ప్రక్షాళనకు కూడా సిద్ధపడుతున్నారు. కొత్త వారికే టికెట్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకతను కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఉద్యోగులు ప్రభుత్వంపై సమ్మె చేస్తున్న నేపథ్యంలో తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నాలు పెడుతున్నారు. ఉద్యోగుల పక్షాన నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు రాష్ర్టంలో అమరావతి, పోలవరం, అభివృద్ధి పనులు, రహదారులు తదితర సమస్యలు వెంటాడుతున్న నేపథ్యంలో వైసీపీని ఎలాగైనా తుదముట్టించాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
Also Read: Chandrababu: వారానికో నేతను చేర్చుకుంటారంట.. వారిపైనే చంద్రబాబు ఆశలు..