Pragya Jaiswal: సల్మాన్ తో ముట్టుకోవచ్చా ? అని అడిగా – ప్రగ్యా జైస్వాల్

Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కి ‘అఖండ’తో ఘన విజయం వచ్చింది. దాంతో ఈ హీరోయిన్ మీడియాలో వరసగా హడావుడి చేస్తోంది. నిజానికి పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రాకపోయినా.. వచ్చేసినట్టు చేసేసినట్టు మాట్లాడేస్తోంది. అయితే, ప్రగ్యా జైస్వాల్ గతంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ తో కూడా కలిసి నటించింది. కాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించడం గురించి హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన అనుభవాలను పంచుకుంది. సల్మాన్ […]

Written By: Shiva, Updated On : January 25, 2022 10:55 am
Follow us on

Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కి ‘అఖండ’తో ఘన విజయం వచ్చింది. దాంతో ఈ హీరోయిన్ మీడియాలో వరసగా హడావుడి చేస్తోంది. నిజానికి పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రాకపోయినా.. వచ్చేసినట్టు చేసేసినట్టు మాట్లాడేస్తోంది. అయితే, ప్రగ్యా జైస్వాల్ గతంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ తో కూడా కలిసి నటించింది. కాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించడం గురించి హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన అనుభవాలను పంచుకుంది.

Pragya Jaiswal

సల్మాన్ సర్ ను కలిసిన మొదటి రోజే ‘మిమ్మల్ని ముట్టుకోవచ్చా?’ అని అడిగానని చెప్పింది. తానలా అడగ్గానే ‘ఏం పర్లేదు. నువ్వు నన్ను ముట్టుకోవచ్చు’ అని సల్మాన్ చెప్పాడని, దీంతో చాలా హ్యాపీగా ఫీలయ్యానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సాంగ్ షూటింగ్ అంతా సౌకర్యవంతంగా సాగిందని తెలిపింది. మరి ‘ముట్టుకోవచ్చా?’ అని అడిగి మరి ప్రగ్యా సల్మాన్ ను ముట్టుకుంది అన్నమాట.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో నాకు ఆ పాత్రే ఎక్కువ ఇష్టం – రాజమౌళి

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కి ‘అఖండ’తో ఘన విజయం వచ్చింది. ‘అఖండ’ సినిమా రిలీజ్ అయి కూడా రెండు నెలలు కావస్తోంది. అయినా… ప్రగ్యా జైస్వాల్ మాత్రం ఇప్పటివరకు మరో సినిమాకి సైన్ చేయలేదు. సైన్ చేసే ఆసక్తి ఆమెకు ఉన్నా.. ఎవరూ ఆమెకు ఛాన్స్ ఇవ్వడం లేదు. నిజానికి ఒక భారీ హిట్ పడితే.. వెంటనే హీరోయిన్లకు భారీగా అవకాశాలు వస్తాయి. కానీ ఎంత పెద్ద హిట్ వచ్చినా.. ప్రగ్యా ఫేట్ మాత్రం మారడం లేదు. అయితే, ప్రగ్యా కి ఛాన్స్ లు రాకపోవడానికి ప్రధాన కారణం.. ఆమె తన రెమ్యునరేషన్ ను రెట్టింపు చేయడమే.

Pragya Jaiswal

ప్రస్తుతం ప్రగ్యా ఒక్కో సినిమాకు కోటి రూపాయల పైనే డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. అందుకే, ఇద్దరు సీనియర్ హీరోల సరసన ఆఫర్లు వచ్చినా ఆమె రెమ్యునరేషన్ విషయంలో నచ్చక, ఆ సినిమాలను ఒప్పుకోలేదు. ఎట్టిపరిస్థితుల్లో కోటి తగ్గను అంటుంది. నిజానికి ప్రగ్యా జైస్వాల్ కి స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ఉన్నాయి. పైగా ఆమెకు భాష పై పట్టు కూడా ఉంది. అలాగే నటన పై కూడా ఆసక్తి ఉంది. మంచి నటి అని కూడా ఆమెకు మంచి పేరు ఉంది.

మొత్తమ్మీద అఖండ విజయం వల్ల ఆమెకు కొత్తగా దక్కిందేమీ లేదు. ఇక ప్రగ్యా జైస్వాల్ గతంలో ఓ క్రియేటివ్ డైరెక్టర్ తో చాలా సన్నిహితంగా ఉంది. మరి ఆ డైరెక్టరే ఆమెకు మళ్లీ అవకాశం ఇచ్చి.. ఆమె కెరీర్ ను నిలబెడతాడేమో చూడాలి.

Also Read: డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తింటే అస్సలు వదిలిపెట్టరు!

Tags