Shyam Singa Roy: ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి మరో కొత్త సీన్ రిలీజ్ !

Shyam Singa Roy: నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా మంచి విజయం సాధించింది. శ్యామ్ సింగరాయ్ థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే, ప్రస్తుతం ఓటీటీలోనూ ఈ సినిమా సందడి చేస్తోంది. కాగా ‘శ్యామ్‌సింగరాయ్‌’ నుంచి మరో డిలీటెడ్‌ సీన్‌ ను రిలీజ్ చేశారు. రీసెంట్‌ గా సూపర్‌ హిట్‌ ఈ చిత్రాన్ని దాదాపు ప్రతి తెలుగు […]

Written By: Raghava Rao Gara, Updated On : January 25, 2022 11:02 am
Follow us on

Shyam Singa Roy: నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా మంచి విజయం సాధించింది. శ్యామ్ సింగరాయ్ థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే, ప్రస్తుతం ఓటీటీలోనూ ఈ సినిమా సందడి చేస్తోంది. కాగా ‘శ్యామ్‌సింగరాయ్‌’ నుంచి మరో డిలీటెడ్‌ సీన్‌ ను రిలీజ్ చేశారు. రీసెంట్‌ గా సూపర్‌ హిట్‌ ఈ చిత్రాన్ని దాదాపు ప్రతి తెలుగు ప్రేక్షకుడు చూసి ఉంటాడు.

Shyam Singa Roy

ముఖ్యంగా ద్వితీయార్థం పొయిటిక్‌ గా ఉంటుంది. అయితే నిడివి దృష్ట్యా, అటువంటి కొన్ని సీన్లను ఎడిట్‌ చేసి తీసేసారు. వాటిలో నుండి ఇటీవలే ఓ సీన్‌ విడుదలైంది. నాని యాక్టింగ్‌తో ఈ సీన్‌ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. మరోపక్క విమర్శకులు సైతం ఇది అద్భుతమైన ప్రయోగాత్మక సినిమా అంటూ పొగడ్తల వర్షం కురిపించడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయింది.

Also Read:  ‘ఆర్ఆర్ఆర్’లో నాకు ఆ పాత్రే ఎక్కువ ఇష్టం – రాజమౌళి

 

Shyam Singa Roy

అన్నట్టు ఈ ‘శ్యామ్ సింగ రాయ్’కి హిట్ ప్లాప్ లతో సంబంధం లేదు. ముందే క్యాష్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు రూ.32 కోట్లు రాబట్టింది. అంటే పూర్తి లాభాల్లోకి ‘శ్యామ్ సింగ రాయ్’ వెళ్ళిపోయాడు. దేవదాసీల బాధలను శ్యామ్ సింగరాయ్ సినిమా చాలా బాగా చూపించింది. అందుకే, నాని కెరీర్ లోనే భారీ విజయాన్ని అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Also Read: పెళ్లితో కరోనా, సోనాక్షి క్రేజీ కామెంట్స్.. మరో 3 బెస్ట్ అవార్డులతో “జై భీమ్” !

Tags