వైద్య సిబ్బందిపై సీఎం వరాల జల్లు..

దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఏప్రిల్ 14నాటికి లాక్డౌన్ పూర్తికానుంది. ఈ నేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ కొనసాగించాలా? విడతల వారీగా ఎత్తేవేయాలా? ప్రధాని అన్ని రాష్ట్రాల పార్లమెంటరీ ప్రతినిధులు ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రధాని లాక్డౌన్ పై నిర్ణయం ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిపై హర్యానా సీఎం వరాలజల్లు కురిపించారు. ప్రస్తుత విపత్కర […]

Written By: Neelambaram, Updated On : April 10, 2020 1:15 pm
Follow us on


దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఏప్రిల్ 14నాటికి లాక్డౌన్ పూర్తికానుంది. ఈ నేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ కొనసాగించాలా? విడతల వారీగా ఎత్తేవేయాలా? ప్రధాని అన్ని రాష్ట్రాల పార్లమెంటరీ ప్రతినిధులు ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రధాని లాక్డౌన్ పై నిర్ణయం ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిపై హర్యానా సీఎం వరాలజల్లు కురిపించారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన హర్యానా ప్రభుత్వం వైద్య సిబ్బందికి తీపి కబురు చెప్పింది. కరోనా నివారణకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు, అంబులెన్స్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లకు జీతాలను డబుల్ చేసినట్లు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ కట్టర్‌ తాజాగా ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా తగ్గేవరకు వీరికి నెలనెలా రెట్టింపు జీతాలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.

కరోనా నివారణ, లాక్డౌన్ అమలులో కృషి చేస్తున్న పోలీసులకు ప్రభుత్వం బీమా కల్పించింది. విధి నిర్వహాణలో పోలీసు చనిపోతే వారి కుటుంబాలకు రూ.30లక్షల పరిహారం ఇవ్వనుంది. అలాగే కేంద్రం ప్రకటించిన బీమా పథకం పరిధిలోకిరాని ఆరోగ్య సిబ్బంది, పోలీసులకు స్థాయినిబట్టి రూ.10లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పరిహారం అందజేయనున్నట్లు సీఎం మనోహర్ లాల్ కట్టర్ ప్రకటించారు. సీఎం నిర్ణయంపై ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.