https://oktelugu.com/

రూ.1500 పై వచ్చిన ఈ వదంతులు నమ్మకండి!

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో జన్ ధన్ ఖాతాదారులను ఆదుకునే ఉద్దేశ్యంతో నెలకు రూ.500 చొప్పున 3 నెలల పాటు రూ.1500 అకౌంట్లలో వేస్తామని చెప్పిన కేంద్రం దాని ప్రకారం ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.500 ఇప్పటికే ఖాతాదారుల అకౌంట్లలో జమ చేసింది. అయితే ఆ డబ్బును వెంటనే డ్రా చేసుకోకపోతే వెనక్కి పోతాయని కొన్ని వదంతులు వచ్చాయి. ఈ విషయం పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించి, జన్ ధన్ ఖాతాలో డబ్బులు ఎప్పటికైనా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 10, 2020 / 01:33 PM IST
    Follow us on

    ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో జన్ ధన్ ఖాతాదారులను ఆదుకునే ఉద్దేశ్యంతో నెలకు రూ.500 చొప్పున 3 నెలల పాటు రూ.1500 అకౌంట్లలో వేస్తామని చెప్పిన కేంద్రం దాని ప్రకారం ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.500 ఇప్పటికే ఖాతాదారుల అకౌంట్లలో జమ చేసింది. అయితే ఆ డబ్బును వెంటనే డ్రా చేసుకోకపోతే వెనక్కి పోతాయని కొన్ని వదంతులు వచ్చాయి. ఈ విషయం పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించి, జన్ ధన్ ఖాతాలో డబ్బులు ఎప్పటికైనా ఖాతాలో ఉంటాయని తెలిపారు.

    జన్ ధన్ ఖాతాలు ఎక్కువగా ఎస్బీఐలో ఉన్నాయి. జన్ ధన్ డబ్బులు వెనక్కి పోవని, ఆ వదంతులను నమ్మవద్దని ఎస్బీఐ,కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన ఖాతాల్లో జమ చేసిన డబ్బులను ప్రభుత్వం వెనక్కి తీసుకోదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మిగిలిన వెయ్యి రూపాయలను రూ.500 చొప్పున తర్వాతి రెండు నెలల్లో జమ చేస్తామని తెలిపింది. ప్రభుత్వం జమ చేసిన డబ్బులను లబ్ధిదారులు తమకు అనువైనప్పుడు తీసుకోవచ్చని ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్‌ఎస్‌) ట్వీట్‌ చేసింది.

    మే, జూన్‌లో రూ.500 చొప్పున జమ చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతం 38.08 కోట్ల జన్‌ ధన్‌ ఖాతాలు ఉండగా అందులో 20.60 కోట్లు మహిళలవే. ఏప్రిల్‌ 1 నాటికి జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.1.19 లక్షల కోట్లు జమ అయ్యాయి. డబ్బులు వెనక్కి పోతాయన్న ఉద్దేశ్యంతో ఖాతాదారులు బ్యాంకుల వద్ద కనీస దూరం పాటించకుండా గుమికూడుతున్నారు. అలా కాకుండా కేంద్రం,బ్యాంకులు స్పష్టతనిచ్చాయి.