ఈటలపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఆత్మగౌరవాన్ని బీజేపీలో తాకట్టు పెట్టారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈటలపై మరోమారు విమర్శలు చేశారు. గతంలో ఇద్దరు సహచర మంత్రులుగా ఉన్నా క్రమంగా వారిలో దూరం పెరిగినట్లు తెలుస్తోంది. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. కేసీఆర్ కింద అత్యంత అవమానించబడిన వ్యక్తి హరీశ్ రావే అంటూ ఈటల తరచు వ్యాఖ్యలు చేస్తున్నా హరీశ్ రావు పట్టించుకోవడం లేదు. దీంతో ఇద్దరి మధ్య వైరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని చెప్పి […]

Written By: Raghava Rao Gara, Updated On : June 27, 2021 6:08 pm
Follow us on

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఆత్మగౌరవాన్ని బీజేపీలో తాకట్టు పెట్టారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈటలపై మరోమారు విమర్శలు చేశారు. గతంలో ఇద్దరు సహచర మంత్రులుగా ఉన్నా క్రమంగా వారిలో దూరం పెరిగినట్లు తెలుస్తోంది. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. కేసీఆర్ కింద అత్యంత అవమానించబడిన వ్యక్తి హరీశ్ రావే అంటూ ఈటల తరచు వ్యాఖ్యలు చేస్తున్నా హరీశ్ రావు పట్టించుకోవడం లేదు. దీంతో ఇద్దరి మధ్య వైరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని చెప్పి టీఆర్ఎస్ ను వదిలిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరి తన ఆత్మగౌరవాన్ని అక్కడ తాకట్టు పెట్టారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. తన ఆస్తులను కాపాడుకునే క్రమంలో బీజేపీలో చేరారని గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల బీజేపీ అధ్యక్షుడు నన్నబోయిన రవి యాదవ్ తన అనుచరులతో మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడారు.

తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ విధానాలతోనే అందరు ఓట్లు వేసి గెలిపిస్తున్నారని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈటల పార్టీని వీడారని గుర్తు చేశారు. వచ్చే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయమే ఖాయమని జోస్యం చెప్పారు. ఇప్పటికే ఈ విషయం తేలిపోయిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ విజయాన్ని ఎవరు ఆపలేరని పేర్కొన్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. అనంతరం రవియాదవ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతోనే పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈటల వేధింపులు భరించలేకనే పార్టీ వీడినట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉఫాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.