https://oktelugu.com/

మరణానికి ముందు సుశాంత్ సంకేతాలు?

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. అతడి మరణానికి గల కారణాలు ఏంటనేది ఇప్పటికీ నిగ్గు తేలలేదు. ఇప్పటికీ పోలీసులు, ఎన్.సీ.బీ విచారణలో నిగ్గు తేలడం.. డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. Also Read: ‘ర‌కుల్ ప్రీత్ సింగ్’.. మళ్ళీ అడవిలోకి ! ఈ క్రమంలోనే సుశాంత్ మరణానికి ముందు జరిగిన ఓ కీలక పరిణామం తాజాగా వెలుగుచూసినట్లు తెలిసింది. అదిప్పుడు సంచలనంగా మారింది. సుశాంత్ తన మరణానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2020 / 09:53 AM IST
    Follow us on

    బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. అతడి మరణానికి గల కారణాలు ఏంటనేది ఇప్పటికీ నిగ్గు తేలలేదు. ఇప్పటికీ పోలీసులు, ఎన్.సీ.బీ విచారణలో నిగ్గు తేలడం.. డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి.

    Also Read: ‘ర‌కుల్ ప్రీత్ సింగ్’.. మళ్ళీ అడవిలోకి !

    ఈ క్రమంలోనే సుశాంత్ మరణానికి ముందు జరిగిన ఓ కీలక పరిణామం తాజాగా వెలుగుచూసినట్లు తెలిసింది. అదిప్పుడు సంచలనంగా మారింది.

    సుశాంత్ తన మరణానికి ముందు కుటుంబ సభ్యులకు తాను ఆపదలో ఉన్నట్టు.. ఆపదలు చుట్టుముట్టినట్లు సంకేతాలు పంపించినట్లు తాజాగా తేలింది.  తన సోదరి మీతూ సింగ్ కు పంపిన మెసేజ్ లో ఈ మేరకు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

    Also Read: కృతిశెట్టికి బర్తేడ్ గిప్ట్ ఇచ్చిన ‘ఉప్పెన’ టీమ్

    ‘అక్కా నాకు భయమేస్తోంది.. నన్ను చంపేస్తారేమో.. అనే అనుమానంగా ఉంది. ఈ సమయంలో నీతో మాట్లాడాలనుకుంటున్నా.. ఎందుకంటే వాళ్లు ఏదో ఒకదానిలో నన్ను ఇరుక్కునేలా చేస్తారని భయపడుతున్నా’ అని మెసేజ్ ను తన అక్కకు పంపినట్టు గుర్తించారు. తాజాగా వెలుగుచూసిన మెసేజ్ మరింత ఆసక్తికరంగా మారింది.