https://oktelugu.com/

బీజేపీకి టార్గెట్‌ అయిన హరీష్‌ రావు?

టీఆర్‌‌ఎస్‌లో మంత్రి హరీష్‌రావుకు జరుగుతున్న అన్యాయంపై మొన్నటివరకు బీజేపీ నేతలు ఆయన పట్ల సానుభూతి తెలిపారు. పార్టీలో హరీష్‌ను దూరం పెడుతున్నారని.. హరీష్‌ లేనిదే పార్టీ లేదంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. తన మేనమామనే హరీష్‌ను దూరం పెట్టాలని చూస్తున్నారని.. అందుకే ఆయన పేరును కూడా ఎక్కడా ప్రస్తావించడం లేదంటూ చెప్పుకొచ్చారు. ఇది మొన్నటి వరకు ఉన్న పరిస్థితి. Also Read: ప్రతిపక్షం ఎవరో దుబ్బాక డిసైడ్ చేస్తుందా? కానీ.. ఇప్పుడంతా రివర్స్‌. బీజేపీ టార్గెట్‌ హరీష్‌రావు. ఆయనను […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 12:50 pm
    Follow us on

    BJP targeted Harish Rao

    టీఆర్‌‌ఎస్‌లో మంత్రి హరీష్‌రావుకు జరుగుతున్న అన్యాయంపై మొన్నటివరకు బీజేపీ నేతలు ఆయన పట్ల సానుభూతి తెలిపారు. పార్టీలో హరీష్‌ను దూరం పెడుతున్నారని.. హరీష్‌ లేనిదే పార్టీ లేదంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. తన మేనమామనే హరీష్‌ను దూరం పెట్టాలని చూస్తున్నారని.. అందుకే ఆయన పేరును కూడా ఎక్కడా ప్రస్తావించడం లేదంటూ చెప్పుకొచ్చారు. ఇది మొన్నటి వరకు ఉన్న పరిస్థితి.

    Also Read: ప్రతిపక్షం ఎవరో దుబ్బాక డిసైడ్ చేస్తుందా?

    కానీ.. ఇప్పుడంతా రివర్స్‌. బీజేపీ టార్గెట్‌ హరీష్‌రావు. ఆయనను లక్ష్యంగా చేస్తూ బీజేపీ విమర్శలు చేస్తోంది. మొన్నటి దాకా హరీష్‌ మంచోడే అన్నట్లుగా మాట్లాడిన బీజేపీ లీడర్లు.. ఇప్పుడు ఆయన మీదనే మాటల దాడికి దిగుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని గెలుపించుకునేందుకు హరీష్‌ కుట్రలు చేస్తున్నాడని దుయ్యబడుతున్నారు. అయితే.. ఉన్నట్టుండి బీజేపీ ఈ స్టంట్‌ తీసుకోవడం కారణాలూ లేకపోలేదు.

    మొన్నటి దుబ్బాక డబ్బుల సీనే ఇదంతటికి కారణంగా చెప్పొచ్చు. హరీష్‌ రావు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై పగబట్టి కావాలనే ఇదంతా చేస్తున్నారని బీజేపీ నేతల వాదన. బీజేపీకి వస్తున్న సానుభూతి, ఎక్కడ గెలుస్తుందోననే ఆందోళన టీఆర్‌‌ఎస్‌కు మొదలైందని, అందుకే ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ చెబుతున్నారు.

    Also Read: జగన్‌ సైలెంట్‌ అయినా.. కయ్యానికి టీడీపీ తహతహ

    ఏది ఏమైనా ఇప్పుడు బీజేపీ ప్రధాన శత్రువు హరీష్‌ కావడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అంత పెద్ద బీజేపీకి ఒక ఉప ఎన్నిక‌లో హ‌రీష్ రావు మాత్రమే రాజ‌కీయాంశంగా మారాడు. గ‌త రెండు ప‌ర్యాయాల్లోనూ దుబ్బాక‌లో బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. మరి ఈసారి వీటన్నింటి నేపథ్యంలో గెలిచి తీరుతుందా..? లేదా సెకండ్‌ ప్లేస్‌ ను కైవసం చేసుకుంటుందా..? లేదంటే ఎప్పటిలాగే మూడో ప్లేస్‌కే పరిమితం అవుతుందా..? ఆసక్తిగా మారింది.