https://oktelugu.com/

పూరి షాకింగ్ కామెంట్.. హీరో ఎక్కడైనా చచ్చిపోతాడా?

సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్మాథ్ కు డ్యాషింగ్ డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం.. ఆ మాటలతో అందరినీ మెప్పించడం పూరి అలవాటుగా మారింది. సినిమాలతో బీజీగా ఉండే పూరి జగన్మాథ్ సోషల్ మీడియాలోనూ ఇటీవల యాక్టివ్ గా ఉంటున్నాడు. Also Read: ఆ సినిమా నుంచి మురగదాస్ తప్పుకున్నాడా? తప్పించారా..! ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో కొద్దిరోజులుగా పూరి జగన్మాథ్ ఆసక్తికరమైన విషయాలపై వాయిస్ మేసేజ్ లు పెడుతున్నారు. సమాజంలోని వివిధ సమస్యలపై […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 / 11:09 AM IST
    Follow us on

    సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్మాథ్ కు డ్యాషింగ్ డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం.. ఆ మాటలతో అందరినీ మెప్పించడం పూరి అలవాటుగా మారింది. సినిమాలతో బీజీగా ఉండే పూరి జగన్మాథ్ సోషల్ మీడియాలోనూ ఇటీవల యాక్టివ్ గా ఉంటున్నాడు.

    Also Read: ఆ సినిమా నుంచి మురగదాస్ తప్పుకున్నాడా? తప్పించారా..!

    ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో కొద్దిరోజులుగా పూరి జగన్మాథ్ ఆసక్తికరమైన విషయాలపై వాయిస్ మేసేజ్ లు పెడుతున్నారు. సమాజంలోని వివిధ సమస్యలపై తనదైన విశ్లేషణ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా పూరి జగన్మాథ్ ‘ఆత్మహత్య’ అనే అంశంపై తన పూరి మ్యూజింగ్స్ లో పోస్టు పెట్టాడు.

    ఆత్మహత్య చేసుకునే వాళ్లకు కొందరు పనికిరాని వాళ్లుగా.. బాధ్యతలేని వాళ్లుగా చిత్రీకరిస్తారన్నారు. దీనిని ఆయన తప్పుబడుతూ తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవాళ్లంటే తనకు ఎంతో గౌరవమని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తెలివైన వాళ్లకు మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నారు. ఫూల్స్‌ ఎప్పుడూ ఇలా ఆలోచించరని తెలిపాడు.

    చాలామంది మాత్రం పిరికివాళ్లే ఆత్మహత్య చేసుకుంటారని భావిస్తారని.. అది అబద్ధమన్నారు. చనిపోవడానికి చాలా ధైర్యం కావాలని.. ప్రాణం వదిలేసే దమ్ము చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుందన్నారు. జీవితంలో కొన్ని సమస్యల వల్ల చనిపోవాలన్న ఆలోచన వస్తుందని కొన్ని ఉదాహరణలతో వివరించారు.

    నిజంగా బాధ్యత తీసుకునేవాళ్లే ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని అన్నారు. ప్రేమించే గుణం ఉండి. తప్పు చేయనివారు.. ఎవరైనా మాట అంటే తట్టుకోలేనివారు.. ఆత్మాభిమానం ఎక్కువ ఉన్నవారే ఆత్మహత్యలు చేసుకుంటారని పూరి జగన్మాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ రచ్చ: ఎన్టీఆర్ టోపీ తీస్తారా? రాజమౌళి కాంప్రమైజ్ అవుతారా?

    ఇవన్నీ కూడా హీరో లక్షణాలని.. హీరో చావడమేంటి అని పూరి ప్రశ్నించాడు. హీరో చనిపోతే సినిమా ఫ్లాప్ అవుతుందని కాబట్టి బాధ్యతలు తీసుకునేవారు చనిపోకూడదని.. బాధ్యతలు లేనివాళ్లే ఆత్మహత్యలు చేసుకోవాంటూ పూరి తనదైన శైలిలో విశ్లేషించి అందరినీ ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం పూరి మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.