https://oktelugu.com/

‘గోన గన్నారెడ్డి’గా బాలయ్య.. ఫ్యాన్స్ కు పండుగే..!

నందమూరి నటసింహం బాలకృష్ణ మరో చారిత్రక సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. విశ్వవిఖ్యాత నటసర్వభౌముడు నందమూరి తారకరామరావు తనయుడిగా బాలయ్య ఆయన బాటలోనే నడుస్తున్నాడు. తండ్రిని మరిపించేలా పౌరాణిక.. జానపద చిత్రాల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. Also Read: పూరి షాకింగ్ కామెంట్.. హీరో ఎక్కడైనా చచ్చిపోతాడా? బాలకృష్ణ కెరీర్ తొలినాళ్ల నుంచి పలు జానపద.. పౌరణిక చిత్రాల్లో నటించి మెప్పించారు. అదేవిధంగా మాస్.. క్లాస్ ప్రేక్షకులను అలరించే సినిమాలు చేసి బాలయ్య […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 / 11:22 AM IST
    Follow us on

    నందమూరి నటసింహం బాలకృష్ణ మరో చారిత్రక సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. విశ్వవిఖ్యాత నటసర్వభౌముడు నందమూరి తారకరామరావు తనయుడిగా బాలయ్య ఆయన బాటలోనే నడుస్తున్నాడు. తండ్రిని మరిపించేలా పౌరాణిక.. జానపద చిత్రాల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

    Also Read: పూరి షాకింగ్ కామెంట్.. హీరో ఎక్కడైనా చచ్చిపోతాడా?

    బాలకృష్ణ కెరీర్ తొలినాళ్ల నుంచి పలు జానపద.. పౌరణిక చిత్రాల్లో నటించి మెప్పించారు. అదేవిధంగా మాస్.. క్లాస్ ప్రేక్షకులను అలరించే సినిమాలు చేసి బాలయ్య అందరివాడని నిరూపించుకున్నాడు. ఇక ఫ్యాక్షన్ సినిమాల్లో బాలయ్యకు తిరుగులేదని చెప్పొచ్చు. తనదైన డైలాగులతో అభిమానులను ఉర్రూతలూగిస్తుంటాడు.

    ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు బోయపాటితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్న బాలయ్య ఓ పాత్రలో అఘెరగా నటిస్తుండటం విశేషం. అఘోర షూటింగు మొత్తం కాశీలో తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమా పూర్తిగానే బాలయ్య మరో పవర్ ఫుల్ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

    బాలకృష్ణ ఇటీవలే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’గా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్టు అందుకున్నాడు. బాలయ్య వందో సినిమా క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వచ్చింది. ఈ సినిమా విజయవంతం కావడంతో బాలయ్య మరో చారిత్రాక సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు. గోనా గన్నారెడ్డి జీవితాధరంగా తెరకెక్కి సినిమాలో బాలయ్య నటించనున్నాడనే టాక్ విన్పిస్తోంది.

    Also Read: ఆ సినిమా నుంచి మురగదాస్ తప్పుకున్నాడా? తప్పించారా..!

    బోయపాటితో బాలయ్య చేస్తున్న సినిమా పూర్తికాగానే ‘గోనా గన్నారెడ్డి’ సినిమా పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. అయితే ఈ మూవీని డైరెక్ట్ చేసేది ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది. బాలకృష్ణ గోనా గన్నారెడ్డి కన్పించనుండటంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.