https://oktelugu.com/

Harish Rao: ఆర్థిక, వైద్యశాఖపై కాకుండా విద్యుత్ శాఖపై హరీశ్ రావు సమీక్ష.. అసలు ఏం జరుగుతోంది?

Harish Rao: రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మరో సంచలనానికి తెరలేపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లేని సమయంలో ఏకంగా విద్యుత్ శాఖ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో డిస్కంల అప్పులు, ఆదాయ వ్యయాలపై లెక్కలు తీసి ఆరా తీశారు. ఈ విషయం తెలియడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ఏదో జరగబోతోందని అంతా అనుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఈ విషయంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ సమీక్ష ముఖ్యమంత్రికి తెలిసే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2021 / 02:57 PM IST
    Follow us on

    Harish Rao: రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మరో సంచలనానికి తెరలేపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లేని సమయంలో ఏకంగా విద్యుత్ శాఖ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో డిస్కంల అప్పులు, ఆదాయ వ్యయాలపై లెక్కలు తీసి ఆరా తీశారు. ఈ విషయం తెలియడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ఏదో జరగబోతోందని అంతా అనుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఈ విషయంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ సమీక్ష ముఖ్యమంత్రికి తెలిసే జరిగిందా? లేకపోతే హరీశ్ రావే చొరవ తీసుకుని మరీ నిర్వహించారా? అని పలు అనుమానాలకు తావిస్తోంది.

    Harish Rao

    కేసీఆర్, కేటీఆర్ టైంలో ఎందుకు?

    ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ అపాయింట్ మెంట్ కూడా కోరినట్టు తెలుస్తోంది. యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించడంలో పాటు కేంద్రాన్ని ఎదుర్కొవడానికి స్టాలిన్, కేసీఆర్‌లు ఏకమై యూపీఏ పంచన చేరేందుకు చర్చలు జరపడానికి వెళ్లారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మంత్రి కేటీఆర్ కూడ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సమయంలో హరీశ్ రావు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని సమీక్ష నిర్వహించడం ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చర్యతో ఈటల రాజేందర్ దుస్థితే హరీశ్ రావుకు కూడా రావొచ్చని కొందరు అనుమానిస్తున్నారు.

    సొంత శాఖలు వదిలి విద్యుత్ శాఖపైనే ఎందుకు..

    మంత్రి హరీశ్ రావు ప్రస్తుతం ఆర్థికశాఖ, వైద్యారోగ్యశాఖను చూస్తున్నారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా తన శాఖలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించలేదు. కానీ ఉన్నట్టుండి విద్యుత్ శాఖపై ఎందుకు సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖపై మంత్రి జగదీశ్ రెడ్డి సమీక్ష నిర్వహించాలని కదా.. ఆయన స్థానంలో హరీశ్ రావు ఎందుకు చూస్తున్నారు. ఇదంతా అధిష్టానానికి తెలుసా.. కేసీఆర్ ఆదేశాల మేరకే మంత్రి జగదీశ్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని సమీక్ష చేశారా? విద్యుత్ చార్జీలు పెంచాలని డిస్కంలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. లేకపోతే తీవ్ర అప్పుల్లో కూరుకుపోతామని హెచ్చరిస్తున్నాయి. సీఎం బిజీగా ఉన్నందున ఆలస్యం కావొద్దని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హరీశ్ రావు సమీక్ష నిర్వహించారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, విద్యుత్ శాఖపై సమీక్ష పూర్తి కాలేదని మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది.

    Also Read: RK Roja: హమ్మయ్య రోజా కు తప్పిన విమాన ప్రమాదం.. త్రుటిలో ఇలా..!

    హరీశ్ రావు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినప్పుడు, ప్రస్తుతం ఆరోగ్య, ఆర్థిక మంత్రిగా ఉన్న టైంలో కూడా ఎక్కువగా బయట కనిపించడం లేదు. కేవలం సిద్ధిపేటకే పరిమితం అయ్యారు. ఏదైనా మీటింగులు, అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ మీటింగ్ టైంలోనే హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల టైంలో నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు. అలాంటిది ఒక్కసారిగా హరీశ్ రావు ఇలా సమీక్షలు నిర్వహించడం ఏంటని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ సమీక్షలు గతంలో సీఎం కేసీఆర్ నిర్వహించేవారు. ప్రస్తుతం అల్లుడు నిర్వహించంతో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందోనని అంతా ఆలోచనలో పడ్డారు.

    Also Read: Narendra Modi: ఇందుకే మోడీ.. ప్రజల మనుసు గెలిచేది?

    Tags