Telugu Movies: సినిమాల పై యువతకి రోజురోజుకు ఆసక్తి పెరుగుతుంది. ఒకప్పుడు అరుదుగా సినిమాల్లోకి వెళ్ళాలి అనుకునేవాళ్లు. కానీ, నేడు చాలామంది యువకులు సినిమాల్లోకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తెగ ఉబలాట పడుతున్నారు. ముఖ్యంగా దర్శకుడిగా మారాలని ఆశ పడుతున్నారు. అయితే, వీళ్లల్లో చాలామందికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి ఏ మాత్రం అవగాహన ఉండదు.
మరి చిత్ర పరిశ్రమలో ఏ సంబంధాలు లేకుండా కేవలం సినిమా మీద ప్రేమ, ఆసక్తితో దర్శకుడు కావాలనుకునే వాళ్ళు ఎలా ముందుకు పోవాలి ? ఆ అంశం పై నెట్టింట తెగ వెతుకున్నారు. సరే.. ఓ సాధారణమైన ఇరవై రెండేళ్ల కుర్రాడు సినిమాల్లోకి వెళ్దాం అని ఆసక్తి చూపిస్తున్నాడు అనుకుందాం. మొదటగా 10 – 15 నిమిషాల షార్ట్ ఫిల్మ్స్ తో ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ పోర్టఫోలియో మీకు ముందు ముందు ఎంతగానో పనికొస్తుంది.
అలాగే బిజినెస్ చేసే మిత్రులకు ఉచితంగా ఆడ్స్ చేసి ఇచ్చినా మంచి అనుభవం వస్తోంది. షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్ కారణంగా సృజన పెరుగుతుంది. ఇక సినిమాలను అర్ధం చేసుకోవాలి. కుదిరితే.. రివ్యూస్ రాస్తూ ఉండండి. ఒక్కొక్క క్రాఫ్ట్ మీద మీకున్న పట్టు తెలుస్తుంది . అప్ కమింగ్ డైరెక్టర్లతో మాట్లాడండి. అనుభవాలు అర్ధం అవుతాయి.
Also Read: సీక్రెట్‌గా పెండ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఎందరో తెలుసా…?
ఇక అసిస్టెంట్ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఐదేళ్లు – పదేళ్ళు కాకుండా కేవలం రెండేళ్లలోనే డైరెక్టర్ ఎలా అవ్వాలో ఆలోచించి తగిన విధంగా ప్రణాళికలు వేసుకోండి. అపుడే గెలుపు త్వరగా వస్తోంది. అన్నిటికి కంటే ముఖ్యంగా ఎవడు చూస్తాడో – ఎవడు చూడడో అని లెక్కలు వేసుకుని సినిమా తీయవద్దు.
మీరు అనుకున్న కథ ఏమిటి ? ఆ కథకు తగ్గట్టు కథనం ఉందా ? దాన్ని స్క్రీన్ పైకి బాగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి. మీ అరచేతిలో స్మార్ట్ ఫోనే అనే బ్రహ్మాస్త్రం ఉందనే సంగతి గుర్తు పెట్టుకోండి. దానితో వేసే అడుగు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే.. ఆ అడుగుకు ఎవరి సాయం అక్కర్లేదు.
Also Read: 2021లో తొలి చిత్రంతోనే హిట్టందుకున్న దర్శకులు వీళ్లే..!