https://oktelugu.com/

Bangarraju Movie: ” పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ” ను అనౌన్స్ చేసిన బంగార్రాజు టీమ్…

Bangarraju Movie: కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నాగ్ – కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్ గా ఈ మూవీ రానుంది. సోగ్గాడే చిన్ని నాయన నాగ్ కెరీర్ లో ఒక మైలు రాయిగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 14, 2021 / 03:01 PM IST
    Follow us on

    Bangarraju Movie: కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నాగ్ – కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్ గా ఈ మూవీ రానుంది. సోగ్గాడే చిన్ని నాయన నాగ్ కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలిచింది. అలాగే ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగచైతన్య సరసన కృతి శెట్టి సందడి చేయనుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

    ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ అదిరిపోయే పాటను విడుదల చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో నాగార్జున, నాగచైతన్య కలిసి జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా తో స్టెప్పులేస్తూ కనిపిస్తున్నారు. “ఓయ్ బంగార్రాజు నువ్వు పెళ్లిచేసుకొని వెళ్ళిపోతే బంగార్రాజు.. మాకు ఇంకెవ్వరు కొనిపెడతారు కొక బ్లౌజు “ అంటూ సాగే మ్యూజికల్ పోస్టర్ ను వదిలారు. ఈ సాంగ్ టీజర్ ను డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఇక ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.