Harish Rao: టీవీ యంకర్లా లేక కాంగ్రెస్ కార్యకర్తలా.. మహిళా జర్నలిస్టుపై హరీష్ ఫైర్.. వైరల్ వీడియో

ప్రభుత్వ వైఫల్యాలను టీవీ చానెల్‌ మహిళా జర్నలిస్టు హరీశ్‌రావును పదే పదే అడుగుతూ వచ్చింది. దీనికి ఓపికగా సమాధానం చెప్పాల్ని మంత్రి వర్యులు ఒక దశలో సహనం కోల్పోయారు.

Written By: Raj Shekar, Updated On : November 14, 2023 1:07 pm

Harish Rao

Follow us on

Harish Rao: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. అధికార బీఆర్‌ఎస్‌ అన్నిటికన్నా ప్రచారంలో ముందుంది. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న పార్టీపై సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. మరోవైపు కాంగ్రెస్‌ ఎలాగైనా బీఆర్‌ఎస్‌ను గద్దె దించాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ నేతలు తమకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌ సభలతో ప్రచారం చేస్తుటే.. కేటీఆర్, హరీశ్‌రావు రోడ్‌షోలు, పత్రికలు, టీవీ చానెళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి హరీశ్‌రావు సోమవారం ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకూ సమాధానం ఇస్తూ ఓ మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆమెపైనే ఫైర్‌ అయ్యారు.

ఫల్యాలను ఎత్తి చూపినందుకు..
ప్రభుత్వ వైఫల్యాలను టీవీ చానెల్‌ మహిళా జర్నలిస్టు హరీశ్‌రావును పదే పదే అడుగుతూ వచ్చింది. దీనికి ఓపికగా సమాధానం చెప్పాల్ని మంత్రి వర్యులు ఒక దశలో సహనం కోల్పోయారు. సంపద పెంచడం, పంచడం క్షేత్రస్థాయికి చేరలదేని అనగానే ‘కాంగ్రెస్‌ పార్టీ తరఫున అడుగుతున్నావా.. కాంగ్రెస్‌ ఏజెంటువా’ అంటూ ఏక వచనంతో సంబోధించారు. స్లీపింగ్‌ ప్రశ్నలు వేస్తున్నావ్‌ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మిగతా జర్నలిస్టులు కూడా జోక్యం చేసుకుని మేము ప్రశ్నలు అడుగుతాం.. మీరు సమాధానాలు చెప్పాలని అన్నా.. వినిపించుకోకుండా మహిళా జర్నలిస్టుపై దురుసుగా మాట్లాడారు. తర్వాత అందరూ అప్రమత్తమయ్యారు. ప్రశ్నలు అడిగిన వారిని టార్గెట్‌ చేస్తున్నారని ఓ జర్నలిస్టు ముందే మంత్రికి తెలిపి మరీ ప్రశ్నలు అడగడం కనిపించింది.

నేల విడిచి సాము..
పాలకులకు తమ పాలన తీరు తెలుసుకునేందుకు ప్రజాభిప్రాయం పరిణగనలోకి తీసుకోవాలి. కానీ హరీశ్‌రావు మాట్లాడిన తీరు చూస్తుంటే.. ప్రజలు, ప్రతిపక్షాలతో తమకు పనిలేదు. అన్నట్లుగా ఉంది. అధికారంలో ఉన్నామని ఎవరినైనా, ఏమైనా మాట్లాడొచ్చు అన్న ధోరణి స్పష్టంగా కనిపించింది. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకముందు జర్నలిస్టులకు రాజకీయ పార్టీలు గౌవరవం ఇచ్చేవి. కానీ బీఆర్‌ఎస అధికారంలోకి వచ్చాక పార్టీల తీరు మారిపోయింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నాయకులు జర్నలిస్టులపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. యథారాజా థతా ప్రజా అన్నట్లు కేసీఆర్‌ ఇష్టానుసారం మాట్లాడడం అలవాటుగా మారడంతో మంత్రుల కూడా అదే పద్ధతి అవలంబిస్తున్నారు. ఇందుకు తాజా ఇంటర్వ్యూ నిదర్శనం.