spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Harirama Jogaiah- Pawan Kalyan: హరిరామ జోగయ్య అనుకున్నది సాధిస్తారు- పవన్ కళ్యాణ్

Harirama Jogaiah- Pawan Kalyan: హరిరామ జోగయ్య అనుకున్నది సాధిస్తారు- పవన్ కళ్యాణ్

Harirama Jogaiah- Pawan Kalyan: బలమైన పోరాటాలు చేయగల సమర్థులు, అనుకున్నది సాధించే పట్టుదల.. రాజనీతిజ్ఞత కలిగిన నాయకుడు  చేగొండి హరిరామ జోగయ్య   అని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ) రిజర్వేషన్లు కాపులకు వర్తింపచేయాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్షకు సయామత్తం అవుతున్న  హరిరామ జోగయ్య ని ముందుగానే ప్రభుత్వం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిందనే వార్తను తెలుసుకున్న  పవన్ కళ్యాణ్ సోమవారం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లో  హరిరామ జోగయ్యని పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం నిరాకరిస్తూ దీక్షను కొనసాగిస్తున్న ఆయన్ని, వయసురీత్యా వెంటనే దీక్షను విరమించాలని, మందులు వేసుకోవాలని  పవన్ కళ్యాణ్  కోరారు. ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యయుతంగా కలిసికట్టుగా ఈ ప్రభుత్వంపై పోరాడుదామని చెప్పారు. దయచేసి దీక్ష విరమించాలని, ఆశయ సాధన కోసం కలిసి కూర్చొని ఎలా ముందుకు వెళ్లాలో చర్చిద్దామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. హరిరామ జోగయ్య తాజాగా పవన్ కళ్యాణ్ గారి సూచనలకు సానుకూలంగా స్పందించారు. దమననీతిని అనుసరిస్తున్న ఈ ప్రభుత్వంపై బలంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Harirama Jogaiah- Pawan Kalyan
Pawan Kalyan

•వైఎస్సార్ పాలనలో జోగయ్య గారి ఇంటిపై దాడి

ఈ సందర్భంగా   పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ ‘‘2008లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం    హరిరామ జోగయ్య   కుటుంబం మీద దాడి చేయించింది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించారనే కారణంతో   జోగయ్య   సతీమణి ఇంట్లో ఉన్న సమయంలోనే దాడి జరిగింది. అవన్నీ తట్టుకొని నిలబడిన గొప్ప పోరాట యోధుడు ఆయన. వారితో నాకున్న అనుబంధం చాలా విలువైంది. పదవులపై ఎలాంటి ఆపేక్ష లేకుండా, నిస్వార్థంగా రాజకీయాలు చేయగల సమర్థత ఆయన సొంతం. ఆయన విలువైన సూచనలు, సలహాలు మాకు ఎంతో అవసరం. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కచ్చితంగా అలుపెరుగని పోరాటం చేస్తాం. ఓ బృహత్తర కార్యం సాధించాలని మళ్లీ ఈ వయసులో పోరాటబరిలోకి దిగిన   హరిరామ జోగయ్య   స్ఫూర్తి సదా అనుసరణీయం” అన్నారు. ఆశయాన్ని సాధించి చూపించేందుకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనీ, తాత్కాలికంగా అయినా ఆమరణ దీక్షను విరమించి, తర్వాత అందరితో చర్చించి, ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయాలనీ   హరిరామ జోగయ్యని కోరారు.

Harirama Jogaiah- Pawan Kalyan
Harirama Jogaiah- Pawan Kalyan

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper