Hariman Sharma: హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాకు చెందిన హరిమాన్ శర్మ(Hariman Sarma)ను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేశారు. మైదాన ప్రాంతాల్లో యాపిల్ పండించడం ద్వారా ఆయన సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఆయనను యాపిల్ చక్రవర్తి(సేబ్ సామ్రాట్) అని కూడా అంటారు. హరిమాన్ శర్మ 1998లో తన తోటలో యాపిల్‌ను పండించడంపై ప్రయోగాలు ప్రారంభించాడు. మొదల్లో శర్మ ప్లం చెట్టుకు యాపిల్ చెటుటను అంటు కట్టాడు. యాపిల్ తోటల పెంపకంలో ఆయన చూపిన అంకితభావం ఈ రోజు ఆయనను పద్మశ్రీ(Padma Sri) అందుకునేలా చేసింది. హరిమాన్ శర్మ గతంలో జాతీయ వినూత్న వ్యవసాయవేత్త అవార్డు కూడా అందుకున్నాడు. 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ అవార్డ ప్రదానం చేశారు. యాపిల్ పండ్లను చల్లని ప్రాంతాలలోనే కాకుండా వెచ్చని వాతావరణంలో కూడా పండించవచ్చని హరిమాన్ శర్మ నిపూపించారు.
కొత్తరకం యాపిల్ అభివృద్ధి..
అన్నివాతావరణ పరిస్థితులను తట్టుకునేలా హరిమాన్‌శర్మ హెచ్‌ఆర్‌ఎంఎన్–99(HRMN-99) రకం యాపిల్‌ను అభివృద్ధి చేశాడు. ఇది దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది. ఆయన అభివృద్ధి చేసిన రకాన్ని పంజాబ్, బెంగళూరు, తెలంగాణతోపాటు నేపాల్, దక్షిణాఫ్రికా, జర్మనీ, బంగ్లాదేశ్ మొదలైన రాష్ట్రాలలో కూడా పండిస్తున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కూడా ఈ రకం మొక్క పెంచడంలోనూ ఆయన సహాయం చేశారు. ఈ యాపిల్ ప్రత్యేకత ఏమిటంటే జూన్ నెలలో అందుబాటులోకి వస్తుంది. ఈ సమయంలో మార్కెట్‌లో సిమ్లా యాపిల్స్ అందుబాటులో ఉడవు. ఫలితంగా హెచ్‌ఐఆర్‌ఎంఎన్–99 రకం యాపిల్ మంచి డిమాండ్ అందుకుంటుంది.