https://oktelugu.com/

Bandi Sanjay Bail : న్యాయమే గెలిచింది.. బండి సంజయ్ కు బెయిల్ వచ్చింది..

Bandi Sanjay Bail : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 గంటల పాటు వాదనలు.. బండి సంజయ్ బెయిల్ కోసం ఈరోజు హనుమకొండ ఫస్ట్ క్లాస్ కోర్టులో  లాయర్లు బలంగా వాదించారు. పదోతరగతి పేపర్ల లీకేజీ కేసులో అటు ప్రభుత్వం తరుఫున పీపీ కూడా గట్టిగానే పోరాడారు. కానీ ఈ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. సంజయ్ కు బెయిల్ కోసం ఆయన తరుఫున న్యాయవాది […]

Written By:
  • NARESH
  • , Updated On : April 6, 2023 / 10:43 PM IST
    Follow us on

    Bandi Sanjay Bail : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 గంటల పాటు వాదనలు.. బండి సంజయ్ బెయిల్ కోసం ఈరోజు హనుమకొండ ఫస్ట్ క్లాస్ కోర్టులో  లాయర్లు బలంగా వాదించారు. పదోతరగతి పేపర్ల లీకేజీ కేసులో అటు ప్రభుత్వం తరుఫున పీపీ కూడా గట్టిగానే పోరాడారు. కానీ ఈ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. సంజయ్ కు బెయిల్ కోసం ఆయన తరుఫున న్యాయవాది విద్యాసాగర్ రెడ్డి బెయిల్ పిటీషన్ దాఖలు చేసి గట్టిగా వాదించారు. అది ఫలించింది.

    ఇక ప్రభుత్వం తరుఫున పీపీ కౌంటర్ పిటీషన్ వేసి బండి సంజయ్ ను 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసుల తరుఫున వాదించారు. ఇరువైపులా సుధీర్ఘంగా గంటల పాటు వాదనలు విన్న న్యాయమూర్తి బండి సంజయ్ కు రాత్రి 10 గంటల సమయంలో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సంజయ్ తరుఫు వాదనలకు కోర్టు ఏకీభవించింది. ప్రభుత్వం వాదనను కొట్టిపారేసింది. అయితే ఇందులో అనేక ట్విస్టులు చోటు చేసుకోవడం గమనార్హం.  మరో ఆప్షన్ లేకనే బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

    రూ.20వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన హన్మకొండ కోర్టు.. మరోవైపు పోలీస్ కస్టడీ పిటీషన్ ను సోమవారానికి వాయిదా వేసింది. బండి సంజయ్ కు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కరీంనగర్ జైలు నుంచి శుక్రవారం ఉదయం విడుదలయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందజేయనున్నారు

    సంజయ్ బెయిల్ పై కోర్టులో తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. బెయిల్ ఇవ్వాలని బండి తరుఫున లాయర్లు గట్టిగా వాదిస్తుంటే.. ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదించారు. బెయిల్ ఇవ్వకపోయినా.. బెయిల్ పిటీషన్ ను డిస్మిస్ చేయాలని వాదన వినిపించారు. అయితే ఏ ఆదేశాలు ఇచ్చినా ఈరోజే ఇవ్వాలని.. వరుసగా మూడు రోజులు కోర్టుకు సెలవులు ఉన్నాయని.. బెయిల్ పిటీషన్ వాయిదా మాత్రం వేయవద్దని కోర్టుకు బండి సంజయ్ తరుఫున న్యాయవాదులు కోరారు. బెయిల్ పీటీషన్ పై ఇవాళ నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం కోల్పోతామని బండి సంజయ్ తరుఫున లాయర్లు గట్టిగా వాదించారు.

    ఇక పీపీ మాత్రం ఏ1గా ఉన్న బండి సంజయ్ కు బెయిల్ ఇవ్వద్దని.. మూడు రోజులు పోలీస్ కస్టడీ ఇవ్వాలని కోరింది. రెండు వర్గాల వాదనలు 8 గంటల పాటు సాగాయి. చివరకు బండి సంజయ్ వాదనకే మొగ్గు లభించింది. ఆయన విడుదలకు మార్గం సుగమం అయ్యింది.

    పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కుట్రదారు అని పోలీసులు అభియోగం మోపి ఆయనను 3 రోజుల కింద అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. కరీంనగర్ లో అరెస్ట్ హైదరాబాద్ లో తిప్పి చివరకు వరంగల్ లో కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపారు. అయితే కోర్టులో న్యాయమే గెలిచిందని.. సంజయ్ కు బెయిల్ లభించిందని బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.