Boyapati Srinu And Allu Arjun Movie Update: ప్రస్తుతం నడుస్తున్న ఈ పాన్ ఇండియా ట్రెండ్ లో కమర్షియల్ డైరెక్టర్స్ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. అలాంటి దయనీయమైన పరిస్థితిలోకి బోయపాటి శ్రీను(Boyapati Srinu) లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతారని ఆడియన్స్ అసలు ఊహించలేదు. సరైనోడు చిత్రం తర్వాత బోయపాటి తీసిన సినిమాల్లో కేవలం బాలయ్య వి మాత్రమే సూపర్ హిట్స్ అయ్యాయి. కుర్ర హీరోలతో తీసిన సినిమాలు పెద్ద ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి. బోయపాటి శ్రీను బాలయ్య తో తప్పితే ఎవరితోనూ ఇక హిట్ సినిమాలు చేయలేదు, వాళ్ళిద్దరికీ అలా కుదిరేసింది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపించాయి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అనేది ఒక ప్రత్యేకమైన జానర్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’ ఘోరమైన డిజాస్టర్ అవ్వడం తో, ఇప్పుడు బోయపాటి శ్రీను పరిస్థితి దారుణంగా తయారైంది.
వాస్తవానికి బోయపాటి గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ తో ఒక సినిమా చెయ్యాలి. ప్రస్తుతం అట్లీ దర్శకత్వం లో హీరో గా నటిస్తున్న అల్లు అర్జున్, ఆ సినిమా పూర్తి అయిన వెంటనే బోయపాటి శ్రీను తో సినిమాకి కమిట్ అయ్యాడు. ఇది సరైనోడు చిత్రానికి సీక్వెల్ అని కూడా ఫిక్స్ అయ్యింది. కానీ ‘అఖండ 2’ చూసిన తర్వాత అల్లు అర్జున్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్. అల్లు అరవింగ్ బోయపాటి శ్రీను కి అడ్వాన్స్ ఇచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఎప్పటి నుండో వీళ్ళు సినిమా చెయ్యాలని అనుకుంటున్నారు. సరిగ్గా కాంబినేషన్ కుదరకపోవడం తో సెట్స్ పైకి వీళ్ళ సినిమా వెళ్ళలేదు. సూర్య, బోయపాటి కాంబినేషన్ లో ఒక సినిమా చెయ్యాలని గీతా ఆర్ట్స్ సంస్థ ప్రయత్నాలు చేసింది. కానీ సూర్య కి బోయపాటి కథ నచ్చలేదు.
దీంతో ఇక అల్లు అర్జున్ తోనే ఈ బ్యానర్ లో సినిమా చెయ్యాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా అట్టకెక్కింది. దీంతో ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా అల్లు అర్జున్ వైపు నుండి బోయపాటి శ్రీను కి శాశ్వతంగా డోర్లు క్లోజ్ అయ్యినట్టే. అయితే ఇప్పుడు గీత ఆర్ట్స్ సంస్థ బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో మరో సినిమా చేయాలనీ చూస్తుందట. రీసెంట్ గానే ఈ ఇద్దరితో చర్చలు జరిపారని, ఇద్దరికీ కూడా ఈ ప్రాజెక్ట్ చేయడం లో ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపినట్టు తెలుస్తోంది. మరో పది రోజుల్లో, అంటే న్యూ ఇయర్ సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకరటించబోతున్నారట. చూడాలి మరి ఈసారి ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది.