GVL Narasimha Rao Reacts On CM Candidate: సీఎంగా పవన్ అభ్యర్థిత్వం పనికి రాదా? బీజేపీ ఆలోచన ఏంటి?

GVL Narasimha Rao Reacts On CM Candidate: జనసేన కార్యకర్తలు పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తుండగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తక్షణమే స్పందించారు. పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం లేదని కుండబద్దలు కొట్టారు. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం అనుకూలంగా లేరని చెబుతున్నారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఆగ్రహం వస్తోంది. తమ నేతకు సీఎం అభ్యర్థిగా అవకాశం ఇవ్వకపోతే […]

Written By: Srinivas, Updated On : June 6, 2022 6:30 pm
Follow us on

GVL Narasimha Rao Reacts On CM Candidate: జనసేన కార్యకర్తలు పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తుండగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తక్షణమే స్పందించారు. పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం లేదని కుండబద్దలు కొట్టారు. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం అనుకూలంగా లేరని చెబుతున్నారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఆగ్రహం వస్తోంది. తమ నేతకు సీఎం అభ్యర్థిగా అవకాశం ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

GVL Narasimha Rao

దీంతో రెండు పార్టీల్లో వైరం పెరుగుతోంది. ఎన్నికల నాటికి దూరం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై అందరిలో ఒకటే ఉత్కంఠ ఏర్పడింది. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడా లేకపోవడంతో బీజేపీ నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే తీవ్ర నష్టం జరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనసేనకు అవకాశం ఇస్తే పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి కావడం ఖాయంగానే కనిపిస్తోంది. కానీ దీనికి బీజేపీ నేతలు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. కానీ రాజకీయ మార్పులు ఎటు దారి తీస్తాయో తెలియడం లేదు.

Also Read: Father Harassed Daughter: కన్న కూతురే.. కానీ అతడు కసాయి తండ్రి? చివరకు ఏమైంది?

మరోవైపు రాష్ర్ట్టంలో వైసీపీని ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థి ఉండాల్సిందే. లేకపోతే వైసీపీని ఢీకొనడం కష్టమే. అందుకే సీఎం అభ్యర్థి విషయంలో రెండు పార్టీల మధ్య సమన్వయం ఉండాలి. ఐకమత్యమే అజెండాగా కలిసి పోరాడాల్సిన సమయం వచ్చింది. బీజేపీ, జనసేన పార్టీలు తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని కోసం రెండు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేసి వైసీపీని ఓడించేందుకు సిద్ధం అవ్వాల్సిందే.

GVL Narasimha Rao

వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా కూడా ఉండటంతో కార్యకర్తలు ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. మొత్తానికి సీఎం అభ్యర్థిత్వం విషయంలో మాత్రం రెండు పార్టీల్లో సయోధ్య కనిపించడం లేదు. దీంతోనే ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. రెండు పార్టీల్లో సమన్వయం ఏర్పడి సీఎం అభ్యర్థి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ తమ పార్టీల భవిష్యత్ ను పాడు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా నేతలు స్పందించి సీఎం అభ్యర్థి విషయంలో రెండు పార్టీలు చర్చించుకుని సీఎం అభ్యర్థిని ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలి. ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా తమలో తాము ఏకపక్షంగా కాకుండా సమష్టిగా నిర్ణయం తీసుకోవాలి. ఇందుకు గాను సమగ్రంగా చర్చలు జరపాల్సిన అవసరాన్ని గుర్తించాలి. అప్పుడే అధికారం సొంతం అవుతుంది. ప్రణాళికలు, వ్యూహాలు అమలు జరిగితే రెండు పార్టీలకు లాభం జరుగుతుందని తెలుసుకుంటే మంచిదే.

Also Read:JP Nadda Slams YCP Govt: మా పథకాలు.. జగన్ పేర్లు.. పోటు పొడిచిన జేపీ నడ్డా

Tags