Homeట్రెండింగ్ న్యూస్Father Harassed Daughter: కన్న కూతురే.. కానీ అతడు కసాయి తండ్రి? చివరకు ఏమైంది?

Father Harassed Daughter: కన్న కూతురే.. కానీ అతడు కసాయి తండ్రి? చివరకు ఏమైంది?

Father Harassed Daughter: కంచే చేను మేస్తే ఎలా? రక్షించాల్సిన వాడే భక్షిస్తుంటే ఏం చేసేది? సమాజంలో మనిషి రాక్షసుడిగా మారుతున్నాడు. సాటి వారిని హింసలకు గురిచేస్తున్నారు. అయిన వారే కాని వారిగా ప్రవర్తిస్తుంటే ఇక వారికి దిక్కెవరు? వారికి అండగా ఉండేదెవరు? రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. కన్నతండ్రులే కూతుళ్లపై అఘాయిత్యాలు చేస్తున్నారు. దీంతో వారు ఎవరికి చెప్పుకోవాలి. ఏం చేయాలి. చిన్న వయసులో జరుగుతున్న ఆకృత్యాలకు వారి మనసు ఎంత వేదనకు గురవుతుంది.

Father Harassed Daughter
Father Harassed Daughter

మనిషిలో ఇంత రాక్షసత్వం ఎందుకు? కూతురుపై లైంగిక వేధింపులకు దిగిగే ఇక ఆమె పరిస్థితి ఏమిటి? నూరేళ్లు సంసారం చేసుకుంటూ హాయిగా జీవించాల్సిన వారి జీవితాలను మధ్యలోనే బుగ్గిపాలు చేసే వారి విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సమాజంలో ఎంతటి హోదాలో ఉన్న వారైనా లైంగిక దాడులకు పాల్పడితే చట్టపరంగా శిక్షించే అవకాశాలు లేకపోవడంతోనే ఇలా రెచ్చిపోతున్నారు. అమ్మాయిల జీవితాలను ఆర్పేస్తున్నారు. ఫలితంగా వారి భవిష్యత్ కు భంగం కలిగిస్తున్నారు.

Also Read: Surya Remuneration: రెండు నిమిషాల గెస్ట్ రోల్ కి సూర్య ఎంత తీసుకున్నాడు… ఇప్పుడిదే హాట్ టాపిక్

బెంగుళూరులో ఓ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ కన్న కూతురుపైనే కన్నేశాడు. భార్య సోదరిని కూడా వేధించసాగాడు. దీంతో అతడి భార్య పోలీసులను ఆశ్రయించింది. అతడిపై కేసు నమోదు చేయించింది. తరువాత ఇద్దరు విడిపోయి వేరుగా ఉంటున్నారు. ఇది 2005లో జరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ అదే తంతు కొనసాగుతోంది. మరల కూతురును వేధించడంతో భార్య మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Father Harassed Daughter
Father Harassed Daughter

కన్న కూతుర్లపైనే అఘాయిత్యం చేసే సంస్కృతి ఎక్కడిది? బిడ్డను తల్లికంటే ఎక్కువగా చూసుకుంటారు. మా అమ్మే మళ్లీ పుట్టిందని గారాభం చేసే వారిని చూశాం కానీ ఇలా కూతురుపైనే కన్నేసే కసాయి వాళ్లను చూడటానికి కూడా మనసొప్పదు. ఇంతటి దుర్మార్గమైన చర్యకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు ఉండాల్సిందే. ఉరి తీసి ఆడవారికి రక్షణ కల్పించాల్సిందే. ఇంతటి దారుణాలు ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. కసాయి తనం కర్కశంగా మారి కన్న వారినే కాటేసే వరకు వెళ్లడం దారుణం. ఇలాంటి వారుంటే తల్లిదండ్రులకు చెడ్డపేరు వస్తుంది. అందుకే వీరిని సాంఘిక బహిష్కరణ చేసి అమ్మాయిలకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read:Pawan Kalyan AP CM Candidate: బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక.. పవన్ కళ్యాణ్ ‘సీఎం క్యాండిటేట్’యేనా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version