Homeజాతీయ వార్తలుReserve Bank of India: కరెన్సీ నోట్లపై గాంధీ ఫొటో మారుస్తారా?

Reserve Bank of India: కరెన్సీ నోట్లపై గాంధీ ఫొటో మారుస్తారా?

Reserve Bank of India: మన జాతిపిత మహాత్మాగాంధీ. ఆయన సేవలతోనే ఆయనకు గుర్తింపు వచ్చింది. దీంతో ఆయనకు దేశం యావత్తు గౌరవం ఇస్తోంది. గాంధీ జయంతి, స్వాతంత్ర్య దినోత్సం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళి అర్పిస్తున్నాం. తెల్లవారిని దేశం నుంచి తరిమేయడానికి శాంతి, అహింస అనే ఆయుధాలుగా మహాత్మాగాంధీ చేసిన పోరాటం చిరస్మరణీయం. అందుకే ఆయన చూపిన తెగువకు ప్రపంచమే అబ్బురపరుస్తోంది. అంతటి ధీశాలి మహాత్మ గాంధీకి మనం నోట్ల మీద కూడా ఆయన ఫొటో వేస్తున్నాం. ఆయనకు మనం అందించే నిజమైన నివాళి మాత్రం ఇది కాదు. ఆయన చూపిన బాటలో నడిస్తేనే మనం ఆయనను గౌరవించినట్లు అవుతుంది.

Reserve Bank of India
Reserve Bank of India

ఇటీవల మన కరెన్సీ నోట్ల మీద మహాత్మాగాంధీ ఫొటోకు బదులు ఇతరుల ఫొటోలు ముద్రిస్తున్నారనే వాదనలు కొన్ని మీడియాల్లో వచ్చాయి. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. మన జాతిపిత మహాత్మాగాంధీ ఫొటోను తీసేసి నోట్లను ఊహించుకోగలమా? అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. దీనికి కారకులెవరు? ఎందుకు ఇలా చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మహాత్మాగాంధీ చిత్రాలను కరెన్సీ నోట్లపై ముద్రించకుండా చేసే దురాలోచన ఎవరిదనే వాదనలు కూడా వస్తున్నాయి.

Also Read: GVL Narasimha Rao Reacts On CM Candidate: సీఎంగా పవన్ అభ్యర్థిత్వం పనికి రాదా? బీజేపీ ఆలోచన ఏంటి?

అయితే దీనిపై రిజర్వ్ బ్యాంకు వివరణ ఇచ్చింది. అలాంటి ఆలోచన ఏదీ లేదని తేల్చింది. అదంతా వట్టి వదంతులే అని కొట్టిపారేసింది. రవీంద్ర నాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలు ముద్రిస్తున్నారనే వార్తలు హల్ చల్ చేయడంతో అందరిలో అనుమానాలు వచ్చాయి. దీనిపై అధికారులు సమాధానం ఇవ్వడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. మహాత్మాగాంధీ చిత్రాలతోనే కరెన్సీ ఉంటే బాగుందని చెబుతున్నారు. దేశంలో పుకార్లు షికారు చేయడంలో ముఖ్య పాత్ర పోషించే సోషల్ మీడియాతోనే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది.

Reserve Bank of India
Reserve Bank of India

మొత్తానికి మహాత్మాగాంధీ ఫొటోను నోటుపై తీసేయడం అంత సులువైన పని కాదు. దానికి ఎంతో ప్రాసెస్ ఉండాలి. అందుకే అలాంటి సాహసోపేతమైన నిర్ణయానికి ఎవరు కూడా ముందుకు రారు. మన జాతిపితకు మనం ఇచ్చే గౌరవం కూడా అదే. అంతేకాని ఆయన పదవులు ఆశించలేదు. సేవలు మాత్రమే చేశారు. అందుకే ఆయన చిత్రాన్ని నోట్లపై ముద్రించడం జరుగుతుంది. దీన్ని ఎవరు కాదనలేరు. ఇతర దేశాల్లో కూడా మహాత్మాగాంధీకి అనుచరులు ఉన్నారు. ఆయన సిద్ధాంతాలు నమ్మిన వారు ఉండటం తెలిసిందే. అందుకే ఆయన జాతిపిత అయ్యారు. దేశాన్ని నడిపించారు.

Also Read: Surya Remuneration: రెండు నిమిషాల గెస్ట్ రోల్ కి సూర్య ఎంత తీసుకున్నాడు… ఇప్పుడిదే హాట్ టాపిక్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version