https://oktelugu.com/

అగ్రరాజ్యంలో గన్ కల్చర్.. ఆగని రక్తపాతం

మన దేశంలో ఒక తుపాకీ కావాలంటే చాలా కష్టపడాలి.. స్మగ్లింగ్, బీహార్, ముంబైలాంటి చోట్లకు వెళ్లి మాఫియాల వద్ద ఆరాతీయాలి. కానీ అమెరికాలో గన్ లు మార్కెట్లో సులువుగానే దొరుకుతాయి. ఆ గన్ కల్చర్ యే ఇప్పుడు అమెరికాకు పెను శాపమైంది. తాజాగా చోటుచేసుకుంటున్న రెండు ఘటనల్లో ఏకంగా 11 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. అమెరికాలోని కొందరికి పిచ్చి లేస్తుందో.. లేక అవమానంతో రగిలిపోతారో ఏమో కానీ సొంతవారిని.. స్నేహితులను కూడా చంపేస్తున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : May 10, 2021 / 09:08 AM IST
    Follow us on

    మన దేశంలో ఒక తుపాకీ కావాలంటే చాలా కష్టపడాలి.. స్మగ్లింగ్, బీహార్, ముంబైలాంటి చోట్లకు వెళ్లి మాఫియాల వద్ద ఆరాతీయాలి. కానీ అమెరికాలో గన్ లు మార్కెట్లో సులువుగానే దొరుకుతాయి. ఆ గన్ కల్చర్ యే ఇప్పుడు అమెరికాకు పెను శాపమైంది. తాజాగా చోటుచేసుకుంటున్న రెండు ఘటనల్లో ఏకంగా 11 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది.

    అమెరికాలోని కొందరికి పిచ్చి లేస్తుందో.. లేక అవమానంతో రగిలిపోతారో ఏమో కానీ సొంతవారిని.. స్నేహితులను కూడా చంపేస్తున్న దారుణం వెలుగుచూస్తోంది. తాజాగా అమెరికాలోని వుడ్ ల్యాండ్ లో ఇన్నాళ్లు మంచిగా ఉన్న ఓ వ్యక్తి ఇరుగుపొరుగు ఉండే వారిపై కాల్పులు జరిపి కలకలం రేపాడు.. ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు వారి ఇళ్లలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ఆ ఇంటికి నిప్పంటించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా వారిపై నిందితుడు కాల్పులు జరిపాడు. ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు ఆ నిందితుడిని హతమార్చారు.

    అమెరికాలోని కొలరాడోలోని ఓ మొబైల్ హోం పార్కులో పుట్టినరోజు వేడుకల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏడుగురు మృతిచెందారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కుటుంబంలోని ఓ మహిళకు స్నేహితుడు అయిన నిందితుడే ఈ కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. వేడుకలు జరుగుతున్న సమయంలోనే అక్కడికి ప్రవేశించి నిందితుడు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

    ఇలా పేరుకు అగ్రరాజ్యమైనా అక్కడి గన్ కల్చర్ కారణంగా ఎప్పుడు ఎవరి ప్రాణాలు పోతాయో.. ఎప్పుడు ఎవరికి ఆవేశం వచ్చి గన్ తో కాల్చేస్తారోనన్న భయం అక్కడి వారిని వెంటాడుతోంది. అమెరికాలో వరుసగా ఈ కాల్పులు ఘటనలు చోటుచేసుకుంటడడం దిగ్ర్భాంతికి గురిచేస్తోంది.