ఇదో విచిత్రమైన సంఘటన. భర్త నుంచి ఓ భార్య కోరుకుంటున్న కోరిక విచిత్రమైనది. కరోనా ప్రభావంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతుంటే ఆ భార్య మాత్రం ఓ వెరైటీ కోరిక కోరింది. ఏ ఇల్లాలుకు తగిన విధంగా ఆ భార్య తన మనసులోని ఆశ బయటపెట్టింది. భర్త కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే ఆమె తల్లి కావాలని భావించింది. తన భర్త వీర్యంతో తల్లి కావాలనుకుంటున్నట్లు పేర్కొంది. దీంతో ఆస్పత్రి వర్గాలు ఒప్పుకోలేదు. చివరికి ఆమె కోర్టును ఆశ్రయించింది.
గుజరాత్ రాష్ర్టంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వడోదరాకు చెందిన ఓ మహిళకు ఏడాది క్రితం పెళ్లయింది. ఇటీవల ఆమె భర్త కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. తన అవయవాలన్ని దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అతడు కోలుకోవడం కష్టమే అని తెలుస్తోంది.
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఏర్పడింది. తమ భార్యాభర్తల అనుబంధానికి ఓ గుర్తు ఉండాలని ఆ మహిళ కోరుకుంటోంది. తన భర్త నుంచి వీర్యం సేకరించి తనకు పిల్లలు కలిగేలా చూడాలని కోరింది. తన భర్త నుంచి సేకరించిన వీర్యంతో ఐవీఎఫ్ పద్దతిలో తల్లి కావాలని భావించింది. కానీ కరోనా బాధితుడి నుంచి వీర్యం సేకరించేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి. కోర్టు ఆదేశిస్తే చేస్తామని తెలిపాయి. దీంతో ఆ మహిళ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది.
కోర్టు కూడా ఆ మహిళ కోరికను పరిగణనలోకి తీసుకుంది. ఆ పేషెంట్ నుంచి వీర్యం సేకరించి భద్రపరచాలని సూచించింది. ఐవీఎఫ్ ద్వారా గర్బం దాల్చేందుకు అతడి బార్యకు అందించింది. ఆమెకు సహకరించాలని తెలిపింది. దీంతో ఆ మహిళ కోరిక తీరే అవకాశం దక్కడంతో హర్షం వ్యక్తం చేసింది. మొత్తానికి విచిత్రమైన కోరిక తీరినందుకు సంతృప్తి వ్యక్తం చేసింది.