https://oktelugu.com/

‘తౌక్డే’తో గుజరాత్ గజగజ.. పశ్చిమాన పెనుముప్పు

కొన్ని సంవత్సరాల నుంచి భారత దేశానికి తుఫాను గండం వరుసగా ఎదురువతోంది. ఎప్పుడూ నైరుతు, వాయువ్యం దిశగా వచ్చే ఈ విపత్తు ఇప్పుడు పశ్చిమాన మొదలైంది. ఇప్పటికే జరగరాని నష్టం జరిగింది. ‘తౌక్డే’గా నామకరణం చేసిన ఈ తుఫాను ధాటికి పలువురి ప్రాణాలు పోయాయి. భారీగా ఆస్తినష్టం సంభవించింది. దేశానికి పశ్చిమ ప్రాంతాలైన కేరళ, కర్ణాటక, గోవా ప్రాంతాలు ‘తౌక్డే’ వలలో చిక్కుకున్నాయి. ఫలితంగా ఈ రాష్ట్రాలు అల్లకల్లోంగా మారాయి. ఆదివారం మరింత బలపడి గుజరాత్ వైపు […]

Written By:
  • NARESH
  • , Updated On : May 17, 2021 / 09:50 AM IST
    Follow us on

    కొన్ని సంవత్సరాల నుంచి భారత దేశానికి తుఫాను గండం వరుసగా ఎదురువతోంది. ఎప్పుడూ నైరుతు, వాయువ్యం దిశగా వచ్చే ఈ విపత్తు ఇప్పుడు పశ్చిమాన మొదలైంది. ఇప్పటికే జరగరాని నష్టం జరిగింది. ‘తౌక్డే’గా నామకరణం చేసిన ఈ తుఫాను ధాటికి పలువురి ప్రాణాలు పోయాయి. భారీగా ఆస్తినష్టం సంభవించింది. దేశానికి పశ్చిమ ప్రాంతాలైన కేరళ, కర్ణాటక, గోవా ప్రాంతాలు ‘తౌక్డే’ వలలో చిక్కుకున్నాయి. ఫలితంగా ఈ రాష్ట్రాలు అల్లకల్లోంగా మారాయి. ఆదివారం మరింత బలపడి గుజరాత్ వైపు పయనించింది.

    అతి తీవ్ర తుఫానుగా ప్రకటించిన ‘తౌక్డే’ సోమవారం సాయంత్రానికి గుజరాత్ తీరాన్నితాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మంగళవారం పోరు బందర్ వైపు వెల్లనున్నట్లు తెలిపారు. ‘తౌక్డే’ ప్రభావంతో ఇప్పటికే గుజరాత్తో పాటు దీవ్, దమణ్లలో ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. ఇప్పటి వరకు గంటకు 11 కిలోమీటరల్ వేగంతో దూసుకువస్తుండగా సోమవారం సాయంత్రం వరకు మరింత బలపడి గంటకు 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే అవకాశం ఉందని వాతావరణ అధికారులు ప్రకటించారు.

    ఈ తుఫాను ప్రభావం గుజరాత్ పై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని దేవభూమి ద్వారక, జామ్ నగర్, భావ్ నగర్ జిల్లాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఇక జునాగడ్ జిల్లాలో 3 మీటర్ల మేర సముద్ర అలలు ఎగిసిపడే అవకాశం ఉందని తెలిపారు. అహ్మాదాబాద్, ఆనంద్, సూరత్, అమ్రేలీ, భావ్ నగర్ ప్రాంతాల ముంపు ప్రాంతాలపై ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

    ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అలర్టయింది. ఇప్పటికే లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 44, రాష్ట్ర బృందాలు 10 కలిసి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక ‘తౌక్డే’ ప్రభావం మహారాష్ట్రపై కూడా పడనుంది. రాష్ట్రంలోని రాయ్ గడ్ జిల్లాలో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. కాగా కర్ణాటకు ఇప్పటికే తుఫాను ప్రభావంతో నలుగురు మృతి చెందారు.