https://oktelugu.com/

Thailand: థాయ్‌లాండ్‌కు క్యూ కడుతున్న జెన్‌జెడ్‌లు..భారీగా పెరిగి భారత టూరిస్టులు!

భారతీయులు థాయ్‌లాండ్‌ ఆకర్షితులు కావడానికి ఎయిర్‌ బీఎన్‌బీ కొన్ని కారణాలను తెలిపింది. పెరుగుతున్న జనాభా, ప్రయాణాలపై మక్కువ, రెండు దేశాల మధ్య పౌరులకు థాయ్‌ ప్రభుత్వం వీసా మినహాయింపు ఇవ్వడం అని వెల్లడించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 11, 2024 / 03:43 PM IST

    Thailand

    Follow us on

    Thailand: భారత యువత థాయ్‌లాండ్‌కు క్యూ కడుతున్నారు. గతంతో పోలిస్తే.. 2022–23లో థాయ్‌లాండ్‌ను సందర్శించిన టూరిస్టుల సంఖ్య 60 శాతం పెరిగింది. ఈ విషయాన్ని పాపులర్‌ రెంటల్‌ కంపెనీ ఎయిర్‌ బీఎన్‌బీ తెలిపింది. భారతీయ టూరిస్టులకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది. హోలీ, ఈస్టర్‌ సమయాల్లో భాతీయులు ఎక్కువగా థాయ్‌లాండ్‌ను సందర్శించారని తెలిపింది. వారం రోజుల పొడవునా జరిగిన ఈ ఫెస్టివల్‌లో థాయ్‌లాండ్‌ వచ్చే భారతీయులు గతంలో పోలిస్తే 200 శాతం పెరిగారని ఎయిర్‌ బీఎన్‌బీ తెలిపింది.

    ఎందుకు వెళ్తున్నారంటే..
    భారతీయులు థాయ్‌లాండ్‌ ఆకర్షితులు కావడానికి ఎయిర్‌ బీఎన్‌బీ కొన్ని కారణాలను తెలిపింది. పెరుగుతున్న జనాభా, ప్రయాణాలపై మక్కువ, రెండు దేశాల మధ్య పౌరులకు థాయ్‌ ప్రభుత్వం వీసా మినహాయింపు ఇవ్వడం అని వెల్లడించింది. ఇక ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో జెన్‌జెడ్‌ యువత ఎక్కువగా ఉందని పేర్కొంది. వారికి థాయ్‌లాండ్‌తోపాటు ఇతర ప్రపంచంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ఆసక్తి ఉన్నట్లు తెలిపింది.

    జెన్‌జెడ్‌ అంటే..
    ఇక జెన్‌జెడ్‌ అంటే.. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జనరేషన్‌ను జెడ్‌(జెన్‌జెడ్‌)గా పరిగణిస్తారు. ఈ మధ్య కాలంలో జన్మించిన యువత ప్రపంచంలో భారత్‌లోనే ఎక్కువగా ఉంది. ఈ తరం యువతకు ప్రయాణాలపై మక్కువ ఎక్కువగా ఉంది. అందుకే థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, ఫెకెట్, చియాంగ్‌మై, క్రాబి, స్యామ్యూయి ప్రాంతాలను సందర్శిస్తున్నారు.

    ఎయిన్‌ బీఎన్‌బీ గురించి..
    ఇది అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కో వేదికగా పనిచేస్తుంది. పర్యాటకులకు సేవలు అందిస్తుంది. వారికి హోటల్, బస, పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన బుకింగ్, ఇతర సేవలు అందిస్తోంది.