Harbhajan Singh: గెలవలేరు గాని.. నోటి దూలకు తక్కువేం లేదు..పాక్ మాజీ క్రికెటర్ కు ఇచ్చి పడేసిన హర్భజన్

టి20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూయార్క్ వేదికగా భారత్ - పాకిస్తాన్ జట్లు ఇటీవల తలపడ్డాయి. లో స్కోర్ నమోదైన ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 11, 2024 3:51 pm

Harbhajan Singh

Follow us on

Harbhajan Singh: పాకిస్తాన్ జట్టు ఆటలో భారత్ తో పోటీ పడలేదు. జెంటిల్మెన్ క్రికెట్ లో ప్రొఫెషనలిజాన్ని ప్రదర్శించలేదు. ఆ జట్టుకు తెలిసిందల్లా ఒక్కటే నోటి దూల. అందువల్లే ఆ జట్టు అంటే ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోరు. చివరికి ఐర్లాండ్ లాంటి పసి కూన చేతిలోనూ ఆ జట్టు ఓడిపోయినప్పటికీ ఆటగాళ్లకు బుద్ధి రావడం లేదు. ఇటీవల టి20 వరల్డ్ కప్ లో అమెరికా చేతిలో ఓడిపోయినా, భారత్ చేతిలో భంగపాటుకు గురైనా ఆ జట్టు ఆటగాళ్లకు కనువిప్పు కలగడం లేదు. పైగా జట్టులో ఆటగాళ్లకు సరైన ఆట తీరు నేర్పాల్సిన మాజీ క్రికెటర్లు మరింత గాడి తప్పుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో కూడా వారికి అర్థం కావడం లేదు.

టి20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూయార్క్ వేదికగా భారత్ – పాకిస్తాన్ జట్లు ఇటీవల తలపడ్డాయి. లో స్కోర్ నమోదైన ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత బౌలర్ అర్ష్ దీప్ సింగ్ ను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడాడు. సిక్కు మతం గురించి హేళన చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. . దీంతో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. “చేసిన మేలు తెలుసుకో. సిక్కుల గురించి నోరు జారడం సరికాదు. ముందు చరిత్ర తెలుసుకుంటే మంచిదని” హర్భజన్ హితవు పలికాడు.

“నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఒప్పుకునేది లేదు. ముందు సిక్కుల చరిత్రను తెలుసుకో. మీ తల్లులను, సోదరీమణులను, ఇతర కుటుంబ సభ్యులను కొంతమంది అపహరిస్తే.. అప్పుడు సిక్కులే కాపాడారు. ఈ విషయం నీకు తెలియకుంటే అది సిక్కుల తప్పు కాదు. ముందు నువ్వు సిగ్గుపడు. సిక్కుల పట్ల కాస్త కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండు” అని హర్భజన్ సింగ్ ట్విట్టర్ వేదికగా కమ్రాన్ అక్మల్ ను కడిపడేశాడు.

తను చేసిన వ్యాఖ్యల వల్ల జరిగిన తప్పును తెలుసుకున్న అక్మల్ ట్విట్టర్ వేదికగానే క్షమాపణ చెప్పాడు. ” నేను చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. నా ఉద్దేశం అది కాదు. హర్భజన్ సింగ్, సిక్కు కమ్యూనిటీకి నా తరఫున క్షమాపణలు చెబుతున్నాను. నా వ్యాఖ్యలు అగౌరవంగా, తప్పుగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులపై నాకు సదాభిప్రాయం ఉంది. వారిపై అమితమైన గౌరవం ఉంది.. దయచేసి నన్ను క్షమించండని” అక్మల్ పేర్కొన్నాడు.. ఇక భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఆరు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.