https://oktelugu.com/

చైనా కుట్ర: టిబెట్ యువతతో భారత్ పై యుద్ధం

చైనా కుయుక్తులు పన్నుతోంది. యుద్ధమే శరణ్యమని భావించి సరిహద్దులను తన ఆధీనంలోకి తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే గత వారం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ టిబెట్ లో పర్యటించి తన అక్కసును వెళ్లగక్కింది. శాంతికి బదులు కయ్యమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది. ఇప్పటికే లద్దాఖ్ సమీపంలో భారీగా సైన్యాన్ని మోహరస్తూ భారత్ కు సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో చైనా కుట్రలను వమ్ము చేసే ఉద్దేశంతో భారత్ కూడా దీటైన సమాధానమే ఇస్తోంది. నిత్యం కయ్యానికే […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 31, 2021 / 10:09 AM IST
    Follow us on

    చైనా కుయుక్తులు పన్నుతోంది. యుద్ధమే శరణ్యమని భావించి సరిహద్దులను తన ఆధీనంలోకి తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే గత వారం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ టిబెట్ లో పర్యటించి తన అక్కసును వెళ్లగక్కింది. శాంతికి బదులు కయ్యమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది. ఇప్పటికే లద్దాఖ్ సమీపంలో భారీగా సైన్యాన్ని మోహరస్తూ భారత్ కు సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో చైనా కుట్రలను వమ్ము చేసే ఉద్దేశంతో భారత్ కూడా దీటైన సమాధానమే ఇస్తోంది. నిత్యం కయ్యానికే కాలు దువ్వే చైనా దురాగాతాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టే క్రమంలో ఇండియా కూడా తన వైఖరి చెబుతోంది.

    భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి వాతావరణం వేడెక్కుతోంది. భారత్ నుంచి ప్రతిఘటన దృష్ట్యా చైనా సైన్యం పడుతున్న ఇబ్బందులను గుర్తిస్తోంది. భారత సరిహద్దులో కార్యకలాపాల కోసం చైనా ప్రస్తుతం టిబెట్ యువత సైన్యంలో చేరాలని సూచిస్తోంది. ఇంటిలో వ్యక్తి చైనా సైన్యంలోకి రావాలని చెబుతోంది. దీంతో చైనా తన సైనిక బలగాన్ని పెంచుకుని భారత్ ను దెబ్బతీయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    చైనా తన సైనిక బలగాన్ని పెంచుకునే క్రమంలో టిబెట్ యువతకు శారీరక పరీక్షలు నిర్వహించి వారిని వేగవంతంగా సైన్యంలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లో సైన్యాన్ని మోహరించి తన ప్రతాపాన్ని చూపించుకోవాలని చూస్తోంది. ఆర్మీ రిక్రూట్ మెంట్ చేసుకునే ప్రక్రియను చైనా వేగవంతం చేస్తోంది. దీనిపై మీడియాలో కథనాలు వస్తున్నాయి.

    టిబెట్ యువతను సైన్యంలోకి తీసకుని వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. భారత్ కూడా స్పెషల్ ప్రాంటియర్ ఫోర్స్ (ఎస్ఎఫ్ఎఫ్) పేరిట టిబెట్ నుంచి భారత్ కు వచ్చిన శరణార్థులతో ఓ ప్రత్యేక బలగాన్ని ఏర్పాటు చేస్తోంది. వాస్తవానికి 19962లో చైనాతో యుద్ధం తర్వాత బలగాలను ఏర్పాటు చేసిన ఆర్మీ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)తో కలిసి శిక్షణ ఇచ్చింది. చైనా ఎత్తుగడలను ఎప్పటిక్పుడు పసిగడుతూ భారత్ కూడా సరైన రీతిలోనే సమాధానం చెబుతోంది.