దేశంలో కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రం రెడీ అయ్యింది. కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్ ను ఎట్టకేలకు భారత్ లోకి అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ టీకాకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. Also Read: తెలంగాణలో కలకలం: ఒకే ఇంట్లో 22 మందికి కరోనా భారత్ లో కోవిషీల్డ్ టీకాను అత్యవసర […]

Written By: NARESH, Updated On : January 2, 2021 12:50 pm
Follow us on

దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రం రెడీ అయ్యింది. కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్ ను ఎట్టకేలకు భారత్ లోకి అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ టీకాకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.

Also Read: తెలంగాణలో కలకలం: ఒకే ఇంట్లో 22 మందికి కరోనా

భారత్ లో కోవిషీల్డ్ టీకాను అత్యవసర వినియోగం కోసం ఆమోదించాలంటూ నిపుణుల కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ టీకా పంపిణీకి డీసీజీఐ అనుమతులిచ్చే అవకాశముంది.

ఇక ఇప్పటికే మరో సంస్థ భారత్ బయోటెక్ దరఖాస్తుపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆక్స్ ఫర్డ్ టీకా 90శాతం సమర్థత సాధించినట్లు వెల్లడించింది. ఆస్పత్రుల్లో చేరే తీవ్రత ఉన్న కేసుల్లో వందశాతం రక్షణ కల్పిస్తుందని ఆస్ట్రాజెనెకా తెలిపింది.

Also Read: తెలంగాణ కరోనా సెకండ్ వేవ్.. మంత్రి ఈటల క్లారిటీ

టీకా వినియోగానికి అనమతులు వచ్చిన వెంటనే భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ఆస్ట్రాజెనెకా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకోసం భారత్ లోని సీరం ఇన్ స్టిట్యూట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే దాదాపు 5 కోట్ల డోసులను ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా సీరం ఇనిస్టిట్యూట్ వెల్లడించింది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్