
ఏపీలో గడిచిన 24 గంటల్లో 58,519 కరోనా పరీక్షలు నిర్వహించగా 326 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 88261కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిట్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 7108 మంది కొవిడ్ తో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 350 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 872266 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3238 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,1884085 కరోనా పరీక్షలు చేసినట్లు బులెటిన్ ల వెల్లడించింది.