గ్రేటర్ ఫైట్: బీజేపీలో ‘ఆ నలుగురి’కి బాధ్యతలు..

తెలగాణలోని హైదరాబాద్ లో త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నాయకులతో పాటు మద్దతుదారుడిగా ఉన్న ఎంఐఎం అధినేత ఓవైసీతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో దీపావళి తరువాత ఏ క్షణాన్నైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. Also Read: తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన: ముగ్గురు మంత్రులు ఔట్? ఈ తరుణంలో బీజేపీ అధిష్టానం హైదరాబాద్ గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికల […]

Written By: NARESH, Updated On : November 14, 2020 10:31 am
Follow us on

తెలగాణలోని హైదరాబాద్ లో త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నాయకులతో పాటు మద్దతుదారుడిగా ఉన్న ఎంఐఎం అధినేత ఓవైసీతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో దీపావళి తరువాత ఏ క్షణాన్నైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

Also Read: తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన: ముగ్గురు మంత్రులు ఔట్?

ఈ తరుణంలో బీజేపీ అధిష్టానం హైదరాబాద్ గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతలను నలుగురు బీజేపీ నాయకులకు అప్పగించినట్లు సమాచారం. కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబద్ ఎంపీ అరవింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావులకు ఈ ఎన్నికల వ్యవహారాలను చూసుకునేలా బాధ్యతలు కల్పించినట్లు తెలస్తోంది.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గంలోని జూబ్లిహిల్స్, హిమాయత్ నగర్, అంబర్ పేట, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఇప్పటికే మంచి పట్టుంది. దీంతో ఆయా నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల గెలుపునకు క్రుషి చేసే అవకాశం ఉంది. ఇక కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గంలో తన మాటల తూటాలతో ప్రజలను ఆలోచింపజేశాడు. దీంతో గ్రేటర్ పరిధిలోనూ పదునైన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకులా ప్రణాళికను రూపొందించేలా చేయాలని పార్టీ అధిష్టానం సూచించినట్లు సమాచారం.

Also Read: డీకే అరుణ, పురంధేశ్వరికి అందలం.. బీజేపీ సంచలన నిర్ణయాలు

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. తన వాక్చాతుర్యతకు ఇప్పటికే యువత ఫిదా అవుతోంది. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వ లోపాలను, కేసీఆర్, కేటీఆర్ పై విమర్శలతో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేలా చేయాలని పార్టీ సూచించినట్లు తెలుస్తోంది. ఇటీవల దుబ్బాకలో విజయం సాధించిన రఘునందన్ రావు విద్యావంతుడు కావడంతో పాటు ప్రజల్లో మంచిపేరు సాధించారు. దీంతో ఆయనను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వాడుకుంటే కలిసొచ్చే అవకాశం ఉందని పార్టీ భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఈ విధంగా నలుగురు నాయకులతో గ్రేటర్ ఎన్నికల్లో సీట్లు కొట్టాలని చూస్తోంది. మొత్తంగా మేయర్ సీటును లక్ష్యంగా చేసుకొని ఎన్నికల్లోకి దిగాలని, ప్రభుత్వ తప్పులను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.