తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన: ముగ్గురు మంత్రులు ఔట్?

తెలంగాణ కేబినెట్ ను ప్రక్షాళన చేయడానికి సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో తిరుగులేని టీఆర్ఎస్ జోరుకు దుబ్బాక ఓట‌మి పెద్ద బ్రేక్ వేసింది. త్వ‌ర‌లోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు మునిసిప‌ల్ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఎవ‌రు దూకుడుగా ఉన్నారు ? ఎవ‌రు ప్ర‌జాక్షేత్రంలో తిరుగుతున్నారు ? అనే అంశాల‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. Also Read: డీకే అరుణ, పురంధేశ్వరికి అందలం.. బీజేపీ సంచలన […]

Written By: NARESH, Updated On : November 14, 2020 10:43 am
Follow us on

తెలంగాణ కేబినెట్ ను ప్రక్షాళన చేయడానికి సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో తిరుగులేని టీఆర్ఎస్ జోరుకు దుబ్బాక ఓట‌మి పెద్ద బ్రేక్ వేసింది. త్వ‌ర‌లోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు మునిసిప‌ల్ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఎవ‌రు దూకుడుగా ఉన్నారు ? ఎవ‌రు ప్ర‌జాక్షేత్రంలో తిరుగుతున్నారు ? అనే అంశాల‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read: డీకే అరుణ, పురంధేశ్వరికి అందలం.. బీజేపీ సంచలన నిర్ణయాలు

ఓ మంత్రి రాస‌లీలల్లో గ‌డుపుతున్నార‌ని, మ‌రికొంద‌రు.. సొంత ప‌నుల్లో ఉన్నారని కేసీఆర్ కు రిపోర్టు అందిందట… ఇంకొంద‌రు సొంత ఇమేజ్ పెంచుకునేందుకు స‌మ‌యం వెచ్చిస్తున్నార‌న్న నివేదిక‌లు కేసీఆర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక‌రిద్ద‌రు ప్ర‌జ‌ల్లో ఉండ‌డం లేదని వారిని ప‌క్క‌న పెట్టాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఉత్త‌ర తెలంగాణ‌కు చెందిన ఒక‌రు, ద‌క్షిణ తెలంగాణ‌కు చెందిన ఇద్ద‌రిపై వేటు పడే అవకాశం ఉందని సమాచారం.

రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌.. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తొలుత తాను సీఎంగా.. హోంమంత్రిగా మ‌హ‌మూద్ అలీ మాత్ర‌మే ప్ర‌మాణం చేశారు. చాన్నాళ్ల‌కు కానీ.. మంత్రుల‌ను కేటాయించ‌లేదు. ముఖ్యంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఉన్న మంత్రుల‌పై ఆయ‌న కూలంక‌షంగా దృష్టి పెట్టారు.

Also Read: ఈ కార్డు ఉన్నవాళ్లకు శుభవార్త.. 50 శాతానికి పైగా డిస్కౌంట్..?

హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని కూడా మారుస్తార‌ని అనుకుంటున్నారు. ఇటీవ‌ల ఆయ‌న‌కు సీఎం కేసీఆర్ అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌క‌పోవ‌డం.. ఇప్పుడు మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేస్తుండ‌డంతో ఆయ‌న‌కు ఖ‌చ్చితంగా మార్పు త‌ప్ప‌ద‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్