https://oktelugu.com/

వాళ్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. తక్షణమే రూ.10 వేల సాయం..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. వైఎస్సార్‌ బీమా పథకం విధివిధానాలను వెల్లడించింది. ఇంటిపెద్ద చనిపోతే ఆ కుటుంబం ఆర్థికపరమైన ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్సార్ బీమా పథకాన్ని జగన్ సర్కార్ తీసుకొచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో లబ్ధిదారులకు ఏదైనా ఆపద ఎదురైతే తక్షణమే లబ్ధిదారుని కుటుంబానికి 10 వేల రూపాయల సాయం అందించనుంది. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 14, 2020 9:47 am
    Follow us on


    ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. వైఎస్సార్‌ బీమా పథకం విధివిధానాలను వెల్లడించింది. ఇంటిపెద్ద చనిపోతే ఆ కుటుంబం ఆర్థికపరమైన ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్సార్ బీమా పథకాన్ని జగన్ సర్కార్ తీసుకొచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో లబ్ధిదారులకు ఏదైనా ఆపద ఎదురైతే తక్షణమే లబ్ధిదారుని కుటుంబానికి 10 వేల రూపాయల సాయం అందించనుంది.

    పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వైఎస్సార్ బీమా స్కీమ్ కు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ పథకానికి అర్హులైన వాళ్లు సచివాలయాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. వాలంటీర్లు పేర్లు నమోదు చేసుకున్న వాళ్ల వివరాలను నమోదు మొబైల్ యాప్ లో పొందుపరుస్తారు. ఏదైనా ఆపద ఎదురైతే వాలంటీర్, డిజిటల్ అసిస్టెంట్ నామినీ ఇంటికి వెళ్లి డబ్బులను అందజేస్తారు.

    ఆపద ఎదురైన సమయంలో వాలంటీర్లు అందుబాటులో లేని పక్షంలో డిజిటల్ అసిస్టెంట్లు సాయం అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సాధారణ మరణం అయితే 15 రోజుల సమయంలో, ప్రమాదవశాత్తు మరణం అయితే 21 రోజుల్లో బీమా అందుతుంది. లబ్ధిదారుడు గాయాలపాలైతే వలంటీర్, సచివాలయ సిబ్బంది 55 రోజుల్లో లబ్ధిదారుని కుటుంబానికి సాయం అందే విధంగా చేస్తారు.

    వైఎస్సార్‌ బీమా కాల్‌ సెంటర్లు ఈ క్లెయిమ్ లకు సంబంధించిన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాయి. క్లెయిమ్ లకు సంబంధించి నిరంతర పర్యవేక్షణ కొరకు జగన్ సర్కార్ కమిటీని ఏర్పాటు చేస్తోంది. ప్రతి నెల 5వ తేదీలోపు జిల్లాస్థాయి క్లెయిమ్ లను సమీక్షించాల్సి ఉంటుంది. జగన్ సర్కార్ కరోనా కష్ట కాలంలో సైతం పథకాల అమలు దిశగా అడుగులు వేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.