న్యూ ఇయర్‌‌కి తెలంగాణలో గ్రాండ్‌ వెల్‌కం

ఈ 2020 సంవత్సరానికి ఎంత తొందరగా వీలైతే.. అంత తొందరగా బై చెప్పడానికే రెడీ అయ్యారు జనం. అయితే.. ఆ ఏడాదికి కూడా అంత నీరసంగా కాకుండా.. కొంచెం జోష్‌గానే బై చెప్పాలని తెలంగాణ సర్కార్‌‌ నిర్ణయించింది. అంటే.. ఈ నిర్ణయం వెనుక సర్కార్‌‌కు సైతం బెన్‌ఫిట్‌ ఉందనుకోండి. కొత్త సంవత్సర వేడుకలకు ప్రభుత్వం పరోక్షంగా అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం అనూహ్యమైన ఉత్తర్వులు జారీ చేసింది. Also Read: కరోనా కొత్త స్ట్రెయిన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ […]

Written By: Srinivas, Updated On : December 31, 2020 1:11 pm
Follow us on


ఈ 2020 సంవత్సరానికి ఎంత తొందరగా వీలైతే.. అంత తొందరగా బై చెప్పడానికే రెడీ అయ్యారు జనం. అయితే.. ఆ ఏడాదికి కూడా అంత నీరసంగా కాకుండా.. కొంచెం జోష్‌గానే బై చెప్పాలని తెలంగాణ సర్కార్‌‌ నిర్ణయించింది. అంటే.. ఈ నిర్ణయం వెనుక సర్కార్‌‌కు సైతం బెన్‌ఫిట్‌ ఉందనుకోండి. కొత్త సంవత్సర వేడుకలకు ప్రభుత్వం పరోక్షంగా అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం అనూహ్యమైన ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: కరోనా కొత్త స్ట్రెయిన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

డిసెంబర్ 31వ తేదీన మద్యం దుకాణాల సమయాన్ని పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. పన్నెండు గంటల వరకు దుకాణాలను తెరుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే క్లబ్‌లు, పబ్‌లు.. కూడా.. ఒంటి గంట వరకూ తెరుచుకునేందుకు ఉత్తర్వులిచ్చింది. దీంతో నూతన సంవత్సర వేడుకలని నిర్వహించుకోవడానికి ప్రభుత్వం పరోక్షంగా అవకాశం కల్పించిటన్లయింది.

31 సందర్భంగా ఎలాంటి ఈవెంట్లు నిర్వహించకూడదంటూ వారం రోజుల క్రితమే పోలీసులు ప్రకటించారు. క్లబ్‌లు, పబ్‌లతోపాటు హోటళ్ల నిర్వాహకులందరికీ హెచ్చరికలు జారీ చేశారు. స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. అయితే ప్రభుత్వం ఇలాంటి అనుమతి ఇవ్వడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే వివిధ ఈనెంట్లు నిర్వహించే వారు మార్కెటింగ్ ప్రారంభించారు. ప్రభుత్వం ఈవెంట్లకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు. కేవలం మద్యం అమ్మకాల వరకే పర్మిషన్ ఇచ్చింది. కానీ.. అలా ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్‌ను హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌ల యాజమాన్యాలు.. ఈవెంట్‌కు అనుగుణంగా మార్చుకునేందుకు కసరత్తు ప్రారంభించారు.

Also Read: జనసేనాని కాస్త మత సేనాని అయ్యాడా..?

అయితే.. పక్క రాష్ట్రమైన ఏపీ మాత్రం న్యూ ఇయర్‌‌ కోసం ఇలాంటి పర్మిషన్లు మాత్రం ఏవీ ఇవ్వలేదు. నిజానికి ఏపీ సర్కార్ కరోనా కారణంగా మద్యం అమ్మకాలను బంద్ చేయించాలనుకుంది. కానీ.. ఆదాయం పడిపోతుంది కాబట్టి వద్దనుకుంది. మామూలు సమయాల్లో మద్యం అమ్మాలని నిర్ణయించింది. దీన్ని పెంచితే విమర్శలు వస్తాయని మద్యం అమ్మకాల సమయాన్ని పెంచాలని అనుకోవడం లేదు. దాంతో ఏపీ యూత్ జోష్ కూడా హైదరాబాద్‌లోనే జరగనుంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్