https://oktelugu.com/

బాలయ్య అనగానే నో అంటున్న హీరోలు !

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – నట సింహం బాలయ్య బాబు సినిమాలో ఒక యంగ్ హీరో పాత్ర కూడా ఉంది. అది బాలయ్య అసిస్టెంట్ పాత్ర అన్నమాట. జస్ట్ అసిస్టెంట్ రోల్ పాత్ర అయినా, ఆ పాత్ర కోసం ఫేమ్ ఉన్న హీరో కావాలి. అందుకే చాలామందిని అనుకున్నారు ఆ పాత్ర కోసం. ఆ మధ్య ఈ రోల్ కోసం మొదట నానిని తీసుకుందామనుకున్నారు. ఆ తరువాత నిఖిల్ ను తీసుకోవాలనుకున్నారు. వాళ్లిద్దరూ ఈ సినిమాలో […]

Written By:
  • admin
  • , Updated On : January 20, 2021 / 12:14 PM IST
    Follow us on


    మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – నట సింహం బాలయ్య బాబు సినిమాలో ఒక యంగ్ హీరో పాత్ర కూడా ఉంది. అది బాలయ్య అసిస్టెంట్ పాత్ర అన్నమాట. జస్ట్ అసిస్టెంట్ రోల్ పాత్ర అయినా, ఆ పాత్ర కోసం ఫేమ్ ఉన్న హీరో కావాలి. అందుకే చాలామందిని అనుకున్నారు ఆ పాత్ర కోసం. ఆ మధ్య ఈ రోల్ కోసం మొదట నానిని తీసుకుందామనుకున్నారు. ఆ తరువాత నిఖిల్ ను తీసుకోవాలనుకున్నారు. వాళ్లిద్దరూ ఈ సినిమాలో చేయడానికి ఇంట్రస్ట్ చూపించలేదు. నిజానికి ఈ సినిమాలో బాలయ్య పాత్ర తాలూకు యాక్టివిటీస్ అన్ని ఆ యంగ్ హీరో పాత్ర కోసమే ఆధారపడి ఉంటాయి.

    Also Read: హీరోగారి పై చీటింగ్ కేసు !

    అందుకే నాని, నిఖిల్ లాంటి హీరో అయితేనే సినిమా నిలబడుతుందని అనేది బోయపాటి ఆలోచన. కానీ బాలయ్య అనేసరికి నాని, నిఖిల్ లాంటి వారూ నో అనేస్తున్నారు. పోనీ ఫామ్ లో ఉన్న మిగిలిన ఎవరేజ్ హీరోలను చూసుకుంటే.. విజయ్ దేవరకొండ, శర్వానంద్ లాంటి హీరోలు ఉన్నా.. బాలయ్య సినిమాలో అసిస్టెంట్ పాత్ర చేయడానికి వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు. మొత్తానికి బాలయ్య సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఫామ్ లో ఉన్న ఏ హీరో ముందుకు రాని పరిస్థితినే ఉందనేది బోయపాటికి ఇప్పటికే అర్ధం అయిపొయింది.

    Also Read: ట్రైలర్ టాక్: ‘సూపర్ ఓవర్’ మూవీ

    బోయపాటి శ్రీను ఏ హీరోని కదిలించినా సైలెంట్ గా తప్పించుకు తిరుగుతున్నారట, అందుకే నవీన్ పొలిశెట్టిని తీసుకోవడమే ఇక బెటర్ అప్షన్ ఏమో అనుకుంటున్నారు. కానీ నవీన్ కూడా చేస్తాడా ? అనేది డౌటే. ఇక ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా.. మ్యూజిక్ సెన్సేషనల్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్లాప్ లతో బాధ పడుతున్న బాలయ్యకు ‘సింహ’ ‘లెజెండ్’ రూపంలో పెద్ద హిట్స్ ఇచ్చిన బోయపాటి, మరి ఈ సారి కూడా అలాంటి సూపర్ హిట్ నే ఇస్తాడేమో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్