Decline Of The Congress: ప్రజలు ఓట్లు వేస్తున్నారు. కాంగ్రెస్ గెలుస్తోంది. మెజారిటీ స్థానాలు సాధించినా పీఠాన్ని అధిష్టించడంలో చతికిల పడుతోంది. అప్పటిదాకా పార్టీ గుర్తు ద్వారా గెలిచిన వాళ్ళు తీరా “చేయి” ఇస్తుండడంతో చతికిల పడుతోంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు 8 రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షానికే పరిమితం అయింది.

sonia gandhi
ఎందుకిలా జరుగుతోంది
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడుతోంది. అప్పటిదాకా పలు రాష్ట్రాలు తన గుప్పిట ఉన్నా ఒక్కో దాన్ని అయితే భారతీయ జనతా పార్టీకో లేదా ప్రాంతీయ పార్టీలకు అప్పగించుకుంటూ వస్తోంది. వీటన్నింటికి కారణం నేతల్లో ఐకమత్య లోపం. మరోవైపు అధిష్టానం నియమించిన ఇన్చార్జిల ఒంటెత్తు పోకడల ఫలితం. నేతలంతా కోటరీగా ఏర్పడి ఎవరికి వారే యమునాతీరుగా ఉండటంతో కాంగ్రెస్ గత కాలపు వైభవానికే పరిమితం అవుతున్నది.
Also Read: Ek Nath Shinde Uddhav Thackeray : ఠాక్రేపై తిరగబడ్డ షిండే కథ
8 రాష్ట్రాలను కోల్పోయింది
2014 నుంచి ఇప్పటి దాకా కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించినా ఫిరాయింపు ఎమ్మెల్యేల వల్ల ఎనిమిది రాష్ట్రాలను కోల్పోయింది.
2014లో అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలకు గాను 42 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కేవలం 11 స్థానాల్లో మాత్రమే బిజెపి అభ్యర్థులు గెలిచారు. ఈ క్రమంలోనే 2016లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమ ఖండు సహా 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి ఫిరాయించి బీజేపీ నేతృత్వంలోని నార్త్ ఈస్ట్ డెమోక్రాటిక్ అలయన్స్ కు చెందిన పీపుల్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ లో చేరారు. తర్వాత వారంతా బిజెపి కండువా కప్పుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అందునా అరుణాచల్ ప్రదేశ్లో అధికార పార్టీ ముఖ్యమంత్రి సహా 41 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి ఫిరాయించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.
2015 ఎన్నికల అనంతరం బీహార్లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీ(యూ), కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నియమితులయ్యారు. 2017 లో కూటమి మధ్యలో అనేక చీలికలు పీలికలు కారణంగా నితీష్ కుమార్ బయటకు వచ్చారు. బీజేపీతో చేతులు కలిపి జెడి (యు) బి.జె.పి కూటమి తో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
మధ్యప్రదేశ్ లో 2018 ఎన్నికల అనంతరం 121 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో కమల్నాథ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ జ్యోతిరాదిత్య సింధియా మొదటి నుంచి ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు. కానీ అతని కాదని కమల్నాథ్ వైపు అధిష్టానం దృష్టి మరణించడంతో జ్యోతిరాదిత్య సింధియా అప్పటినుంచి గుర్రుగా ఉన్నారు. తక్కిన సమయం కోసం వేచి చూసి 2020లో తన కోటరీ లోని 26 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు ప్రకటించారు. దీంతో 2020 మార్చి లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది.శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో బిజెపి ప్రభుత్వం కొలువుదీరింది.

sonia gandhi, rahul gandhi
ఇక ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మణిపూర్లో లో 2017 లో ఎన్నికలు జరిగాయి. 60 ఎమ్మెల్యే సీట్లు ఉన్న ఈ రాష్ట్రంలో లో కాంగ్రెస్ 28 స్థానాల్లో గెలుపొందింది. బిజెపి 21 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. కానీ గవర్నర్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీకి పిలుపు అందడంతో 9 మంది కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో అధికారాన్ని చేపట్టింది.
ఇక ఇండియా లాస్ వేగాస్ గా ప్రఖ్యాతి గాంచిన గోవా రాష్ట్రంలో 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2017 లో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాలు గెలుచుకుంది. బిజెపి 13 స్థానాలకే పరిమితమైంది. ఎప్పటికీ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు చెందిన ఓ ఎమ్మెల్యే మద్దతుతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2019లో మరో 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరారు.
దక్షిణాదిలోనే శాండల్వుడ్ స్టేట్ గా ప్రఖ్యాతిగాంచిన కర్ణాటకలో 2018లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 222 స్థానాలు ఉన్న ఈ రాష్ట్ర అసెంబ్లీలో లో బీజేపీ 104 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ కు 80, జేడీ( ఎస్) కు 37 సీట్లు వచ్చాయి. బిజెపి సీనియర్ నేత యడ్యూరప్ప ఆధ్వర్యంలో కమలం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత జరిగిన విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప నెగ్గ లేదు. తర్వాత కుమారస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ జేడీ(ఎస్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అయితే 2019లో కాంగ్రెస్ జెడి (ఎస్) నుంచి గెలుపొందిన 16 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకును బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇక దేవ భూమి అయిన్ ఉత్తరాఖండ్లో 2016లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో అప్పటి ముఖ్య మంత్రి హరీష్ రావత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. దీంతో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో మరల ప్రభుత్వాన్ని పున: స్థాపించాల్సి వచ్చింది.

Decline Of The Congress
దేశంలోనే అత్యంత సున్నితమైన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 2014 లో 87 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పీడీపీ28 స్థానాలు తెచ్చుకుంది. బిజెపి 25 స్థానాలు గెలుచుకుంది. మొదట్లో పార్టీల మధ్య సయోధ్య కుదరక ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. 2018లో పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ముందుకు వచ్చింది. తర్వాత 2018 లో బిజెపి మద్దతు ఉపసంహరించుకోవడంతో ముఫ్తీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కుప్పకూలింది.
కాంగ్రెస్ ను వేధిస్తున్న బహు నాయకత్వం
కాంగ్రెస్ ను వేధిస్తున్న సమస్యల్లో ఒకటి బహు నాయకత్వం. అక్బర్ రోడ్ లోని పార్టీ కార్యాలయాన్ని కుర వృద్ధులు శాసిస్తుండటంతో యువ నాయకత్వం తట్టుకోలేక పోతోంది. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా రాహుల్ గాంధీకి అత్యంత ఇష్టమైన వ్యక్తి. కాని అతడే పార్టీకి గుడ్ బై చెప్పాడు అంటే కాంగ్రెస్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటిదాకా 23మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్లో కొత్త రక్తం రావాలని, పాత తరం నిర్ద్వందంగా తమ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు అంటే పార్టీలో పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటికి మొన్న అధికారంలో ఉన్న రాజస్థాన్లో చింతన్ శిబిర్ ఇలాంటి సమావేశాలు నిర్వహించినా వీటిలో ఎటువంటి దిద్దుబాటు చర్యలు ప్రారంభం కాలేదు. పైగా ఆ కార్యక్రమం జరిగినా 20 రోజులకే మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. కాంగ్రెస్ చేతిలో ఛత్తీస్గడ్, రాజస్థాన్ మాత్రమే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీస్తుండటం గమనార్హం.
Also Read:PK TRS: పీకే సర్వే లీక్.. టీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా?