https://oktelugu.com/

Governor Tamilisai: గవర్నర్ కు షాక్: ఉగాది వేడుకకు హాజరు కాని సీఎం, మంత్రులు.. తగ్గేదేలే అంటున్న తమిళిసై

Governor Tamilisai: తెలంగాణలో కేసీఆర్ అందరితో వైరం కొనసాగిస్తున్నారు దీంతో భవిష్యత్ లో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆయనకు అవసరం లేని వారితో అయితే ఓకే కానీ రాజ్యాంగబద్ధంగా నియమితులైన వారిని కూడా కావాలనే పక్కన పెడితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే విషయం మరిచిపోతున్నారు. ఇటీవల కాలంలో గవర్నర్ ను కావాలనే ఉద్దేశంతోనే పక్కకు పెడుతున్నారు బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండటం ఆనవాయితీ. కానీ అసెంబ్లీ ఆయన సొంత సొత్తు అయినట్లు […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 2, 2022 / 10:57 AM IST
    Follow us on

    Governor Tamilisai: తెలంగాణలో కేసీఆర్ అందరితో వైరం కొనసాగిస్తున్నారు దీంతో భవిష్యత్ లో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆయనకు అవసరం లేని వారితో అయితే ఓకే కానీ రాజ్యాంగబద్ధంగా నియమితులైన వారిని కూడా కావాలనే పక్కన పెడితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే విషయం మరిచిపోతున్నారు. ఇటీవల కాలంలో గవర్నర్ ను కావాలనే ఉద్దేశంతోనే పక్కకు పెడుతున్నారు బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండటం ఆనవాయితీ. కానీ అసెంబ్లీ ఆయన సొంత సొత్తు అయినట్లు ప్రవర్తిస్తున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని దూరం చేయడంతో ప్రతిపక్షాల్లో ఆందోళనలు వచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు.

    Governor Tamilisai

    తెలుగు సంవత్సరాది ఉాగాది పండుగకు రాజకీయ నేతలు రాజ్ భవన్ కు రావడం ఆనవాయితీయే. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రితోపాటు మంత్రులను ఆహ్వానించినా రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనిపై గవర్నర్ కూడా గుర్రుగానే ఉన్నారు. సీఎం కేసీఆర్ పై పోరాటానికే సై అంటున్నారు. గవర్నర్ తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలా మనగలుగుతుందో చూస్తాననే ధోరణిలో ఆమె కూడా సిద్ధమైనట్లు సమాచారం.

    Also Read: Tata IPL 2022: బోణీ కోసం ముంబై.. ఆధిప‌త్యం కోసం రాజ‌స్థాన్‌.. బ‌ల‌బ‌లాలు ఇవే..!

    ప్రజల కోసమే రాజ్ భవన్ ఉందనే విషయం తెలిసినా రాజకీయ నేతలు కావాలనే అటు వైపు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. దీంతో గవర్నర్ సైతం ఆందోళన చెందుతున్నారు. తాము చేసిన తప్పేమిటి? ఏదైనా ఉంటే రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉంటుందనే విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీ కోటాలో కౌశిక్ రెడ్డి నామినేషన్ వచ్చినప్పుడు సరిగా లేదని దానిపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. దీంతో అప్పటి నుంచి గవర్నర్ పై కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

    Tamilisai, KCR

    గవర్నర్ ఉనికిని గుర్తించడానికి కేసీఆర్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో గవర్నర్ కూడా తన సత్తా చాటాలని భావిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ పై పోరాటానికి సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ఇక్కడ కూడా పునరావృతం అవుతాయనే విషయం అర్థమవుతోంది. కానీ తమిళిసై పట్టుదలగా వ్యవహరిస్తే కేసీఆర్ కు తలనొప్పులు తప్పవని తెలుస్తోంది. దీనికంతటికి కారణం కేసీఆర్ అవుతారనే వాదన కూడా వస్తోంది.

    Also Read: Srilanka Crisis: ఆర్థిక సంక్షోభం: శ్రీలంకలో ఎమర్జెన్సీ

    Tags