Warangal MGM Hospital: అత్యంత అమానవీయ ఘటన ఇది. తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రులు ఎంత బాగున్నాయో తెలిపే ఘటన ఇదే కాబోలు. ఎందుకంటే వరంగల్ లోనే అతిపెద్ద ప్రభుత్వాస్పత్రిగా పేరుగాంచిన ఎంజీఎంలో పేషెంట్‌ను ఎలుకలు కొరికడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చికిత్స కోసం వచ్చిన బాధితుడిని ఎలుకలు కొరకడం ఏంటంటూ తీవ్ర విమర్శలు రేకెత్తాయి.

కాగా ఆ బాధితుడు చివరకు ప్రాణాలు విడిచాడు. అసలేమైందంటే.. కొద్ది రోజులుగా శ్రీనివాస్ అనే వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. అతను అంతకు ముందు ప్రైవేట్ ఆస్పత్రిలో ఉండగా.. వారం కిందట ఎంజీఎంకు వచ్చి ఇక్కడే అడ్మిట్ అయ్యాడు. అతనికి డాక్టర్లు ఆర్‌ఐసీయూలో చికిత్స అందిస్తున్నాడు.
కానీ ఆర్ ఐసీయూలో అతను పడుకున్న సమయంలో అతనిపై ఎలుకలు దాడి చేశాయి. అతని చేతివేళ్లు, కాలి వేళ్లను కొరికేశాయి. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం అయింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. వెంటనే శ్రీనివాస్ మీద ఎలుకల దాడికి సంబంధించిన ఘటనను దర్యాప్తు చేసేందుకు ముగ్గురితో కమిటీని నియమించింది.
ఇక శ్రీనివాస్ ఆరోగ్యం విషమించడంతో అతన్ని నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించేందుకు డాక్టర్లు అన్నీ సిద్ధం చేశారు. అతనికి ఎంజీఎంలో చేరిన మొదటి రోజు నుంచే డయాలసిస్ చేస్తుండగా.. ఎలుకలు దాడి చేస్తున్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. కానీ సిబ్బంది, డాక్టర్లు పట్టించుకోలేదంటూ వాపోతున్నారు.

కాగా నిమ్స్ లో శ్రీనివాస్ తుదిశ్వాస విడిచాడు. ఇక ఈ ఘటన నేపథ్యంలో ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. అతని మీద బదిలీ వేటు వేసింది. ఇక మరో ఇద్దరు డాక్టర్లమీద కూడా కఠిన చర్యలకు సిద్ధం అవుతోంది. ఇక శ్రీనివాస్ కుటుంబం మాత్రం ఈ ఘటన మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తీమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ వేడుకుంటోంది.
Also Read: Srilanka Crisis: ఆర్థిక సంక్షోభం: శ్రీలంకలో ఎమర్జెన్సీ