ఆంద్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రసంగించారు. కరోనా నేపథ్యంలో దేశంలోనే తొలిసారి రాజ్ భవన్ నుంచి వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం ఈ సమావేశాల్లో విశేషం. గవర్నర్ ప్రసంగంలో ప్రధానాంశాల వివరాల్లోకి వెళితే…మేనిఫెస్టోలో లేని 40 హామీలను అమలు చేశాము. జల, ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాము. విద్యుత్, రవాణా, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నాము. అణగారిన వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుట్లున్నాము.
ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాము. ఏడాదిలో రూ.42 వేల కోట్లతో సంక్షేమ పథకాలు చేశాము. 18 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ కల్పించాము. రాష్ట్రంలో సేవారంగంలో 9.1శాతం, పారిశ్రామిక రంగంలో 5 శాతం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ధి నెలకొంది. 122 హామీల్లో 77 హామీలు నెరవేర్చాం..39 హామీలు పరిశీలనలో ఉన్నాయి. మన బడి పథకంలో 15700 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పిస్తున్నాము. దశల వారీగా మూడేళ్లలో 45 వేల పాఠశాలల అభివృద్ధి చెయ్యాలని లక్ష్యం. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 6.20 లక్షల మందికి సేవలు అందిస్తున్నాము. హైదరాబాద్, చెన్నై, బెంగూళూరులోనూ ఆరోగ్యశ్రీ సేవలు కల్పిస్తున్నాము. కరువు పరిస్థితుల నుంచి బయటపడేందుకు రూ. 2 వేల కోట్ల విపత్తు సాయం, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నాము. ఎక్కడా లేని విధంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ. వైఎస్‌ఆర్ పెన్షన్ కింద 50 లక్షల మందికి లబ్ధిపొందుతున్నారు. ఇంటి వద్దే పెన్షన్ అందిస్తున్నాము. సంక్షేమ పథకాల ద్వారా 3.92 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.900 కోట్ల సాయం అందించాము. గ్రామీణ ఉత్పత్తులు విక్రయించేందుకు త్వరలో వైఎస్‌ఆర్ జనతా బజార్‌లు తీసుకువస్తున్నాము.
పోలవరం ప్రాజెక్టు 2021 డిసెంబర్‌లోగా పూర్తి చేస్తాము. వచ్చే నాలుగేళ్లలో అన్ని సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.2200 కోట్లు ఆదా చేశాము. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో ఓడరేవుల నిర్మాణం చర్యలు చేపట్టడం జరిగింది. పోర్టుల నిర్మాణానికి మూడేళ్లలో రూ.3200 కోట్లు ఖర్చు చేస్తున్నాము. పెట్టుబడులను ఆహ్వానించేందుకు త్వరలో కొత్త పారిశ్రామిక విధానం అమలు చేస్తున్నాము. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాము, రోజుకు 15 వేల టెస్ట్‌లు చేయడం జరుగుతుంది. జాతీయ సగటు కంటే ఏపీలో రికవరీ రేటు అధికంగా ఉంది. అదేవిధంగా 38 వేల ఐసోలేషన్ బెడ్స్, 1300 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. 24 వేల మంది వైద్యులు, 24500 మంది పారామెడికల్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. గ్రామ వాలంటీర్లు, పోలీసులు సమర్ధవంతంగా పని చేస్తున్నారు. 3.2 లక్షల మంది వలస కార్మికుల ప్రయాణ సౌకర్యం ఉచితంగా కల్పించాము.
మరోవైపు ఉభయ సభలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ విధానంలో గవర్నర్ ప్రసంగించడాన్ని సిపిఐ తప్పు పట్టింది. అసెంబ్లీకి రాలేని గవర్నర్ రాష్ట్రానికి అవసరమా అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆర్డినెన్స్ లపై గుడ్డిగా సంతకాలు చేయడం తప్ప గవర్నర్ వల్ల ప్రయోజనం లేదన్నారు. గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Governor biswabhusan harichandan speech in ap assembly
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com