AP Govt Movie Tickets: సినిమా టికెట్ల వ్యవహారంలో కొద్ది రోజులుగా దుమారం రేగుతోంది. సినిమా పరిశ్రమపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని అందరిలో అనుమానాలున్నా ఎవరు కూడా స్పందించడం లేదు. దీంతో ప్రభుత్వం తన పెత్తనం చేస్తూ నిర్మాతలను ముప్పతిప్పలు పెడుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు, ప్రభుత్వం తలో తీరుగా స్పందిస్తున్నాయి. టికెట్ల జారీలో ప్రభుత్వ జోక్యంపై విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. మరోవైపు బెనిఫిట్ షోలు కూడా రద్దు చేసింది. దీంతో నిర్మాతలకు నిరాశే మిగులుతోంది.
ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధరలపై గతంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా ఎవరు కూడా ఆయనకు మద్దతు తెలపలేదు. దీంతో దానిపై ఎవరు పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న క్రమంలో టికెట్ల తగ్గింపు వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఒక వైపు చిరంజీవి ఆచార్య, మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీలు విడుదలకు సన్నద్దమవుతున్నందున ఎలా అనే సంశయాలు అందరిలో నెలకొన్నాయి.
Also Read: ఏపీ ప్రభుత్వం తెచ్చిన ‘సినీ చట్టం’లో ఏముంది? సినీ ఇండస్ట్రీకి లాభమా? నష్టమా?
సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. చిన్న సినిమాలకు నష్టం లేకున్నా పెద్ద సినిమాలు మాత్రం నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ ను కలిసి ప్రభుత్వ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని సూచించారు. రాష్ర్ట ప్రభుత్వం సమీక్షించుకుని టికెట్ల ధరలపై ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.
ఆన్ లైన్ టికెట్ల ధరల నియంత్రణకు సంబంధించిన బిల్లును బుధవారం అసెంబ్లీ ఆమోదించడంతో నిర్మాతల్లో ఆందోళన నెలకొంది. సినిమా పరిశ్రమను ఇబ్బందులకు గురి చేసే చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వినతులు వస్తున్న క్రమంలో రాష్ర్ట ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో చూడాల్సిందే. జగన్ మాత్రం ఎవరి మాట వినకుండా మోనార్క్ గా వ్యవహరిస్తారనే వాదన కూడా ఉండటంతో సినిమా టికెట్ల వ్యవహారంపై నిర్మాతలు ఏం చేస్తారో అని అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.