Governments Imposing Taxes: పన్ను అంటే.. గ్రామపంచాయతీ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు అన్నిరకాల పాలకులు వసూలు అభివృద్ధి ప్రజల అవసరాలు తీర్చేందుకు, సౌకర్యాలు కల్పించేందుకు, సేవలు పొందినందుకు చెల్లించేది. ఇది పూర్తిగా చట్టబద్ధమైనది. దీనిని ఇప్పుడు ప్రభుత్వాలు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నాయి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే పాలకులు చట్టబద్ధమైన దోపిడీ చేస్తున్నారు.. దీనికి హద్దు లేకుండా పోతోంది. ప్రజలు ఉన్నది పన్నులు కట్టడానికే.. తాము గద్దెనెక్కింది కట్టించుకోవడానికే అన్నట్లుగా చెలరేగిపోతున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్‌లో జీఎస్టీ వచ్చిన తర్వాత ఇది మరీ ఎక్కువైంది.

సంపాదనలో సగం పున్నులకే..
సగటు జీవి కష్టపడే సంపాదనలో సగం వరకూ పన్నుల రూపంలోనే చెల్లించాల్సి వస్తోంది. జీఎస్టీ గండంలో ఇరుక్కున్న సామాన్యుడు ‘మేం తినే తిండిలో కొంత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తింటున్నట్లుగా ఉంది’ అని భావించాల్సిన పరిస్థితి ఉందంటే పన్నుల దోపిడీ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పెరుగుపై 5 శాతం, అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరితే 12 శాతం ట్యాక్స్ కట్టాల్సిందే. చివరికి శ్మశానాల సేవలపైనా 18 శాతం పన్ను వేశారు. కానీ ఇది మొదటిది కాదు.. అలాగని చిట్టచివరిదీ కాదు. మధ్య తరగతి జీవి పన్నుల చక్రబంధంలో నలిగిపోతున్నాడు. సంపాదిస్తే ఆదాయపు పన్ను.. ఖర్చు పెడితే జీఎస్టీ, పెట్రోల్, డీజిల్ ట్యాక్సులు అదనం. దేశంలో ఇన్‌కంట్యాక్స్ కట్టేవాడంటే.. ప్రభుత్వానికి దేవుడే. ఎందుకంటే అతని దగ్గర పన్నుల మీద పన్నులు వసూలు చేస్తారు. హమ్మయ్య.. పన్ను కట్టేశా ఇక మిగిలిన డబ్బులతో ఎవరికీ పన్నులు కట్టకుండా గడపొచ్చనుకుంటే పొరపాటే. కట్టిన పన్ను సంపాదించిన దానికే. ఖర్చు చేయడానికి జీఎస్టీ ఉంది. అంటే సంపాదించుకున్నదానికి పన్ను కట్టడమే కాకుండా.. ఖర్చు పెడుతున్న దానికీ పన్ను కట్టాల్సిందే. ఇంకా బల్క్‌గా దోచుకోవడానికి పెట్రోల్, డీజిల్ పన్నులు ఉండనే ఉన్నాయి. ఈ పన్నులన్నీ కేంద్రం తీసుకునేవే. రాష్ట్రాలు.. స్థానిక సంస్థలు వడ్డించేవి వేరే ఉన్నాయి.
Also Read: PM Modi- Pawan Kalyan: కోరీ మరీ పిలిచిన ప్రధాని మోదీ..తిరస్కరించిన పవన్.. అసలేంటి కథ?
రాష్ట్రాల్లో మరింత దోపిడీ!
రాష్ట్రస్థాయి నుంచి పంచాయతీ వరకూ ఎన్ని రూపాల్లో మధ్యతరగతి మనిషి మీద పన్నుల పేరుతో దాడి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రాలు మరింత దారుణంగా వ్యవహరిస్తున్నాయి. పెట్రోల్, డిజిల్‌పై అదనపు భారం వేయడమే కాకుండా మద్యం ధరలతో మధ్య తరగతి జీవితాలను పేదరికంలోకి నింపేస్తోంది. ఒక్కో ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల ఆదాయాన్ని మీద ఆశిస్తోందంటే ప్రజల ఆదాయాన్ని ఎలా పీలుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాలే కాదు.. ఇక స్థానిక సంస్థలూ పిండేస్తాయి. ఇంటి పన్ను.. నల్లాపన్ను.. పర్మిషన్ ట్యాక్స్.. రోడ్ ట్యాక్స్.. ఇలా అనేక రూపాల్లో నెలð లా వసూళ్లకు దిగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో జనం పడేసే చెత్తపై కూడా అక్కడి ప్రభుత్వం పన్ను విధిస్తోంది. కట్టకపోతే ఇంటి ముందు చెత్త పోస్తామన్న హెచ్చరికలు కూడా చేశారు. అంటే కేంద్రం నుంచి ప్రారంభించి .. మున్సిపాలిటీలు.. పంచాయతీల వరకూ అన్ని చోట్ల పన్నులు పిండుకుంటున్నారు. లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వాలకు.. అదంతా ప్రజల సొమ్మే! కేంద్రానికి ఆదాయపు పన్ను.. పరిశ్రమల మీద పన్నులు.. వ్యాపార సంస్థల మీద పన్నులు ఇలా అన్నీ వచ్చేది కాక జీఎస్టీ ద్వారా నెలకు రూ.రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంకా పెట్రోల్, డీజిల్ మీద ఆదాయం నెలకు రూ. 30 వేల కోట్లకుపైగానే ఉంటుంది. ఇన్‌కంట్యాక్స్ సహా వివిధరకాల పన్నుల మీద ఇంకా భారీగా వసూలవుతోంది. రాష్ట్రాలు కూడా పోటాపోటీగా పన్నులువసూలు చేస్తున్నాయి.

ఈ సొమ్మంతా ఎటు పోతోంది..?
పన్నుల రూపంలో ప్రజల నుంచి నెలకు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు ఈ సొమ్మంతా ఏం చేస్తాయన్నది సగటు మానవుడి ప్రశ్న. వసూలు చేసి పన్నులో ప్రజలకు ఎంత చేరుతుంది.. అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. పని చేయని వాళ్లకు కొంత.. దోపిడీకి కొంత..! చేరుతోందన్నది మాత్రం వాస్తవం. దేశంలో కనీసం పది శాతం మందికైనా ఉచిత విద్య..వైద్యం అందిస్తున్నాయా..?. అందించే విద్య అయినా కాస్త క్వాలిటీగా ఉంటుందా.. తప్పని సరిగా చేయాలన్నట్లుగా చేస్తున్నాయి తప్ప బాధ్యతగా పైసా కూడా ఖర్చు చేయడం లేదు. అదే సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తమ సొంత సొమ్ములా ప్రజల నుంచి వసూలు చేసిన పున్నులను ఖర్చు చేసేస్తున్నాయి. అత్యంత నిరుపేదలను పథకాల రూపంలో లబ్ధి చేకూరుస్తుండగా, అత్యంత ధనికులు.. రాజకీయ పార్టీల ఆర్థిక అవసరాలకు ఖజానాలాగా ఉపయోగపడుతూ తమ ఖజానాను నింపుకుంటున్నాయి. మధ్య తరగతి జీవులు మాత్రమే.. ఎటూ కాకుండా పోతున్నారు.
Also Read:MP Raghu Rama Krishnam Raju: పార్లమెంట్ లో రఘురామ కితకితలు