https://oktelugu.com/

హీరోగారి పై చీటింగ్ కేసు !

యంగ్ హీరో విశ్వంత్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు అవ్వడంతో అందరూ ఒక్కసారిగా సాక్ కి గురి అయ్యారు. ఇంతకీ విశ్వంత్ పై కేసు ఎందుకు నమోదు అయింది అంటే.. తక్కువ ధరకు ఖరీదైన కార్లు ఇప్పిస్తానని మోసం చేశాడట. హైదరాబాద్ లో ఉంటున్న వ్యాపారవేత్త రామకృష్ణ ఓ ఖరీదైన కారు కొనాలనుకున్నాడు. అయితే అతడికి 30శాతం తక్కువ ధరకే కారు ఇప్పిస్తానని విశ్వంత్ నమ్మించి అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడట. […]

Written By:
  • admin
  • , Updated On : January 20, 2021 / 11:13 AM IST
    Follow us on


    యంగ్ హీరో విశ్వంత్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు అవ్వడంతో అందరూ ఒక్కసారిగా సాక్ కి గురి అయ్యారు. ఇంతకీ విశ్వంత్ పై కేసు ఎందుకు నమోదు అయింది అంటే.. తక్కువ ధరకు ఖరీదైన కార్లు ఇప్పిస్తానని మోసం చేశాడట. హైదరాబాద్ లో ఉంటున్న వ్యాపారవేత్త రామకృష్ణ ఓ ఖరీదైన కారు కొనాలనుకున్నాడు. అయితే అతడికి 30శాతం తక్కువ ధరకే కారు ఇప్పిస్తానని విశ్వంత్ నమ్మించి అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడట.

    Also Read: ట్రైలర్ టాక్: ‘సూపర్ ఓవర్’ మూవీ

    కాగా విశ్వంత్ మాటలు నమ్మిన రామకృష్ణ అడ్వాన్స్ గా 10 లక్షలు చెల్లించి.. మళ్ళీ నెల రోజుల తర్వాత మరో రెండున్నర లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తరువాత కొన్ని రోజులు తిప్పించుకుని.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పినట్టుగానే కారును అందించాడు విశ్వంత్. కాకపోతే ఆ కారును రామకృష్ణ పేరు మీద ట్రాన్సఫర్ చేయలేదు. ఓవైపు ఈ వివాదం నడుస్తుండగా, మరోవైపు అదే కారుపై 20 లక్షల రూపాయల అప్పు ఉన్నట్టు తేలింది.

    Also Read: సింగర్ సునీత, ఆమె భర్త రామ్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?

    దీంతో తను మోసపోయానని గ్రహించిన రామకృష్ణ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అసలు ఆ కారు ఎవరది అంటే.. బంజారాహిల్స్ లోని ఓ ఇంటీరియర్ షోరూమ్ ఓనర్ ది అట. అతనితో తనకు పరిచయం ఉందని, అతడికి చెందిన కారును తక్కువ ధరకు ఇప్పిస్తానని చెప్పి మొత్తానికి ఈ యంగ్ హీరో తెలివిగా మోసం చేశాడు. ఇక ఇతగాడు కేరింత, మనమంత, ఓ పిట్టకథ, తోలు బొమ్మలాట లాంటి సినిమాల్లో నటించి బాగానే పేరు తెచ్చుకున్నాడు. కాకపోతే సక్సెస్ కాలేదు అనుకోండి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్