Liquor Policy: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీని ప్రకటించింది. మందు బాబులకు మంచి వార్తే అయినా వారి జేబులు మాత్రం గుల్ల కావాల్సిందే. సొంత బ్రాండ్లను పక్కన పెట్టేసి పాపులర్ బ్రాండ్లను పంపిణీ చేయాలని భావిస్తోంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర కానుకగా చెబుతున్నా అందులో ఏదో మర్మం దాగి ఉందని తెలుస్తోంది. దీనిపై ప్రజల్లో కూడా మిశ్రమ స్పందన వస్తోంది. వైసీపీ విధానంతో మద్యం విధానం పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జగన్ అధికారంలోకి రాకముందే రాష్ర్టంలో మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చినా ప్రస్తుతం దాన్ని మరిచిపోయారు. ఫలితంగా మద్యం ఏపీకి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. దీంతోనే రాష్ర్టంలో మద్యం పాలసీలు మారుస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని ఇనుమడింప చేసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి ఆదాయాన్ని సమకూర్చుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read: బాలయ్య అడుక్కోవడం ఏమిటి ? ఆర్డర్ వేయాలి గానీ..
అయితే ఏపీలో తయారయ్యే మద్యం ఇతర ప్రాంతాల్లో అమ్మకూడదు. దీంతో మందుబాబులను నిలువునా దోచుకునేందుకే ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మందుబాబులను పెంచే క్రమంలోనే సర్కారు నిర్ణయాలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో నూతన మద్యం పాలసీలు తీసుకొస్తూ జగన్ తన జేబులు నింపుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇటీవల బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్ లిక్కర్ పై పేదవాడికి అనుకూలంగా మాట్లాడితే రాద్ధాంతం చేసిన ప్రభుత్వం ఇప్పుడు మద్యం పాలసీలను తీసుకురావడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. తాను చేస్తే శృంగారం.. పక్కవాడు చేస్తే వ్యభిచారం అన్న చందంగా సర్కారు పరిస్థితి మారిపోయింది. దీంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారనే వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: జగన్‌తో విభేదించిన షర్మిల.. అన్నా చెల్లెలి మధ్య ఘర్షణ.. ఏ విషయాల్లోనంటే?