https://oktelugu.com/

Ram Gopal Varma: ‘టికెట్‌ ధరల’ పై   ఆర్జీవీ  లోతైన  విశ్లేషణలు  !  

Ram Gopal Varma: జగన్ ప్రభుత్వం ‘సినిమా టికెట్‌ ధరల’ పై తీసుకున్న నిర్ణయం పై సినిమా వాళ్ళు తమ అసంతృప్తిని ఇప్పటికే రకరకాలుగా వ్యక్తపరిచారు. ఈ క్రమంలో ఆర్జీవీ కూడా పలుమార్లు ఈ అంశం పై తనదైన శైలిలో మాట్లాడాడు. అయితే, రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి ఈ విషయం సుదీర్ఘంగా స్పందిస్తూ యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా తన అభిప్రాయాల్ని చాలా క్లారిటీగా తెలియజేశాడు. థియేటర్ల విషయంలోనూ అదే కరెక్ట్. ఆర్జీవీ మాటల్లో.. ‘నేను ఈ ప్రభుత్వ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 2, 2022 6:28 pm
    Ram Gopal Varma controversies
    Follow us on

    Ram Gopal Varma: జగన్ ప్రభుత్వం ‘సినిమా టికెట్‌ ధరల’ పై తీసుకున్న నిర్ణయం పై సినిమా వాళ్ళు తమ అసంతృప్తిని ఇప్పటికే రకరకాలుగా వ్యక్తపరిచారు. ఈ క్రమంలో ఆర్జీవీ కూడా పలుమార్లు ఈ అంశం పై తనదైన శైలిలో మాట్లాడాడు. అయితే, రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి ఈ విషయం సుదీర్ఘంగా స్పందిస్తూ యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా తన అభిప్రాయాల్ని చాలా క్లారిటీగా తెలియజేశాడు.
    Ram Gopal Varma:

    Ram Gopal Varma:

    థియేటర్ల విషయంలోనూ అదే కరెక్ట్.
    ఆర్జీవీ మాటల్లో.. ‘నేను ఈ ప్రభుత్వ పాలసీలను, అలాగే ఈ రాజకీయాలను నేనెప్పుడూ పట్టించుకోను. ఎందుకంటే వాటిపై నాకు సరైన అండర్ స్టాండింగ్ లేదు, కనీస అవగాహన కూడా లేదు. ఐతే, సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా, ఒక కామన్‌ మ్యాన్‌ గా మాట్లాడుతున్నాను. అంతేగాని నేనెవరినీ తప్పు బట్టడంలేదు. నా మాటలను అర్ధం చేసుకోండి.

    Also Read: నార్త్‌లోనూ ‘తగ్గేదేలే’.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘పుష్ప’ రాజ్..

    ఓ మ్యాన్యుఫ్యాక్చరర్‌ తాను క్రియేట్ చేసిన వస్తువును పలు రకాల ఫ్యాక్టర్స్‌ ను బట్టి దానికి ఒక రేట్ ఫిక్స్ చేస్తాడు. ఆ రేట్ నచ్చితే జనం కొనుక్కుంటారు, నచ్చకపోతే మానేస్తారు. ఇప్పుడు చిన్న హోటల్‌ లో, ఫైవ్‌స్టార్‌ హోటల్ లో తినే ఫుడ్ ఒకటే. కానీ, రేట్లలో చాలా తేడా ఉంటుంది. ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు హోటల్ కి వెళ్తారు. అది వారి వ్యక్తిగతం. అలాగే థియేటర్ల విషయంలోనూ అంతే కదా’.
    ఒకే టికెట్‌ అంటే అందులో అర్థంలేదు !
    తెలుగు సినిమాకి రూ.100 కోట్లు మార్కెట్‌ ఉన్న రోజుల్లో రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ రూ. 200 కోట్ల బడ్జెట్‌ తో బాహుబలి సినిమా తీసి అంతకు మించి వసూళ్లు రాబట్టారు. ఒకవేళ సినిమా ప్లాప్ అయితే, రాజమౌళి, శోభులకే నష్టం కదా. అదే సినిమా హిట్ అయితే, ఆ లాభం చాలామందికి వెళ్తుంది. వెళ్ళింది కూడా. పైగా మొత్తం ఇండస్ట్రీకే పేరొస్తుంది. అందుకే, పెద్ద సినిమాకు, చిన్న సినిమాలకు ఒకే టికెట్‌ ధర పెట్టడం అర్థం లేని తనం’ అంటూ ఆర్జీవీ కామెంట్స్ చేశాడు.
    టికెట్‌ ధరను మరొకరు ఎలా నిర్ణయిస్తారు ?
    సలు ఒక సినిమాకు పెట్టే ఖర్చు రూ. 200 కోట్లు పెట్టుబడి పెడితే.. అది రూ. 1000 కోట్లు వసూలు చేయాలని కోరుకుంటాం. ఒకవేళ ఆ సినిమా నిజంగానే అలా కలెక్ట్ చేస్తోంది అని నమ్మకం ఉన్నప్పుడే కదా, ఆ సినిమా టీమ్ తమ సినిమా టికెట్ రేట్ ను ఫిక్స్ చేసుకుంటుంది.
    ఇది ఎందుకు అర్ధం చేసుకోవట్లేదు. మార్కెట్ లో ఏ వస్తువు అయినా ఒకే రేటుకి ఎలా దొరుకుతుంది ? వస్తువును బట్టి రేటు ఉంటుంది. డిమాండ్ ఉన్నప్పుడే కదా డిమాండ్ చేసేది. కాబట్టి.. రాజమౌళినే తన టికెట్‌ ధరను నిర్ణయించాలి, మరొకరు ఎలా నిర్ణయిస్తారు అంటూ ఆర్జీవీ చాలా లోతుగా అనేక ప్రశ్నలు సంధించాడు.
    Tags